Baahubali movie second song teaser release today

Baahubali movie second song teaser release today

Baahubali second song teaser release today, Baahubali Tamil audio released, Baahubali movie news, Baahubali movie updates, Baahubali promotions, Baahubali latest updates, Baahubali news, Baahubali movie stills, Baahubali posters, Baahubali songs, Baahubali audio, Baahubali trailer, Baahubali teaser, Baahubali

Baahubali movie second song teaser release today: Prabhas Baahubali movie will be release on 10 july. Prabhas, anushka, rana, tamannah acts in lead roles.

కరణ్ విడుదల చేయనున్న బాహుబలి సెకండ్ సాంగ్

Posted: 06/25/2015 05:25 PM IST
Baahubali movie second song teaser release today

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో నటించిన ‘బాహుబలి’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాడి చేయనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లుగా భారీగా జరుగుతున్నాయి. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు.

ఇప్పటికే హిందీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ‘బాహుబలి’ చిత్ర యూనిట్ పాల్గొన్నది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ‘బాహుబలి’ హిందీ వర్షెన్ ను విడుదల చేయనున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ‘మమతల తల్లి...’ అనే పాట టీజర్ ను హిందీలోనే మొట్టమొదటిసారిగా విడుదల చేసారు. ఆ తర్వాతనే అన్ని భాషలలో విడుదల చేసారు. ఈరోజు సాయంత్రం ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ను కరణ్ జోహర్ విడుదల చేయనున్నారు.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు ఆడియో ఇప్పటికే విడుదలై, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్ర తమిళ వర్షెన్ ఆడియో ఈరోజు నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ తమిళ వర్షెన్ ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే తమిళంలో ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా మొదలయ్యాయి.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  second song  trailers  prabhas  anushka  

Other Articles