Actress Meena daughter Nainika debuts into movies

Actress meena daughter nainika debuts into movies

Actress Meena daughter, Meena daughter latest news, Meena daughter debut, Meena daughter nainika updates, Meena daughter Nainika, Nainika latest news, Nainika

Actress Meena daughter Nainika debuts into movies: Actress Meena daughter Nainika debut into kollywood movies. Actress Meena latest news, movies, gossips, stills, gallery.

విజయ్ సినిమాలో మీనా కూతురు నైనిక

Posted: 06/25/2015 12:25 PM IST
Actress meena daughter nainika debuts into movies

ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాణించిన నటి మీనా... ఈ మధ్యే ‘దృశ్యం’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఈ అమ్మడు చిన్న వయసులోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా మీనా నటించి మెప్పించడంతో.. ఆ తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ అయ్యింది. వరుస సినిమాలతో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇప్పటికీ కూడా మీనాకు పలు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే మీనా తన కూతురిని కూడా సినిమాల్లోకి బాలనటిగా పరిచయం చేయబోతుంది. మీనా తన ఐదేళ్ల కూతురు ‘నైనిక’ను తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం చేయించబోతుంది. తన గారాల కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని మీనా చాలా సంతోషంగా వుందట.

తమిళంలో అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో విజయ్ కూతురి పాత్రలో నైనిక నటించనుందట. మరి నైనిక ఎలా కనిపించబోతుందో, తన నటనతో ఎలా ఆకట్టుకోనుందో త్వరలోనే తెలియనుంది. మొత్తానికి తల్లికూతుళ్లు ఇద్దరూ కూడా బాలనటులుగానే ఎంట్రీ ఇస్తున్నారు. భవిష్యత్తులో తన తల్లివలే నైనిక కూడా స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meena  Daughter  Nainika  Vijay  Atlee  Movie news  

Other Articles