Nara Rohit Savitri film launch on 27 june

Nara rohit savitri film launch on 27 june

Nara Rohit Savitri movie launch date, Nara Rohit Savitri movie news, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri movie details, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri launch date, Nara Rohit latest news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohit Savitri film launch on 27 june: Nara Rohit upcoming film Savitri. Pavan Sadhineni director. This film will be launch on 27 june.

సావిత్రికి నారా రోహిత్ ముహూర్తం ఖరారు

Posted: 06/24/2015 03:46 PM IST
Nara rohit savitri film launch on 27 june

‘అసుర’ సినిమా విజయంతో మంచి జోష్ మీదున్న హీరో నారా రోహిత్. చాలా కాలం తర్వాత మంచి విజయం సాధించడంతో నారా రోహిత్ చాలా సంతోషంగా వున్నాడు. దీంతో ఇదే జోష్ లో నారా రోహిత్ మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ‘అసుర’ తర్వాత నారా రోహిత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సావిత్రి’.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందనే విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ చిత్రానికి ‘సావిత్రి’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని జూన్ 27న అధికారికంగా ప్రారంభించనున్నారు. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి కృష్ణ చైతన్య డైలాగ్స్, శ్రవణ్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫిని అందించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర నటీనటులను ఫైనలైజ్ చేయనున్నారు. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Savitri  Launch date  Movie News  

Other Articles