AR Rahaman sing song in GV Prakash kumar 50th film

Ar rahaman sing song in gv prakash kumar 50th film

AR Rahaman sing song in Vijay Atlee film, GV Prakash kumar 50music album, GV Prakash kumar latest movie, GV Prakash kumar movie updates, GV Prakash kumar songs, Vijay movie news, Vijay movie updates, Vijay

AR Rahaman sing song in GV Prakash kumar 50th film: The Great music director AR Rahaman sing song in tamil star hero Vijay next film under director Atlee. GV Prakash kumar music.

50వ చిత్రానికి ఏఆర్ రెహమాన్ పాట

Posted: 06/24/2015 04:18 PM IST
Ar rahaman sing song in gv prakash kumar 50th film

అట్లీ దర్శకత్వంలో నయనతార, ఆర్య, జై, నజ్రియా ప్రధాన పాత్రలలో నటించిన తమిళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘రాజా రాణి’. చాలా కాలం తర్వాత 100 రోజుల వేడుకను జరుపుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇలాంటి చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ తో అట్లీ ఓ చిత్రం తీయబోతున్నాడు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం జి.వి.ప్రకాష్ కు 50వ సినిమా కావడం విశేషం. అయితే ఇందులోని ఓ పాటను పాడటం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను కలిసాడు జి.వి.ప్రకాష్ కుమార్.

జి.వి.ప్రకాష్ కుమార్ అడిగిన వెంటనే రెహమాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం. ఈ సాంగ్ రికార్డింగ్ త్వరలోనే జరుపనున్నారని తెలిసింది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. తన 50వ చిత్రానికి విజయ్ హీరో అవ్వడం, అలాగే అందులో ఏఆర్ రెహమాన్ ఓ పాట పాడబోతుండటంతో జి.వి.ప్రకాష్ కుమార్ చాలా సంతోషంగా వున్నాడట.

విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ‘పులి’ చిత్ర షూటింగ్ లో విజయ్ బిజీగా వున్నాడు. త్వరలోనే ‘పులి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పులి’ షూటింగ్ పూర్తవ్వగానే అట్లీ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  AR Rahaman  Atlee  GV Prakash kumar  

Other Articles