Nani 14 Reels Entertainment new movie launched

Nani 14 reels entertainment new movie launched

Nani new movie launched, Nani movie launched, Nani 14 reels movie launch, Nani new movie launch stills, Nani movie updates, Nani movie stills, Nani movie news, Nani

Nani 14 Reels Entertainment new movie launched: Actor Nani upcoming film under Hanu Raghavapudi direction. 14 Reels Entertainments Banner.

లాంఛనంగా నాని కొత్త సినిమా ప్రారంభం

Posted: 06/22/2015 01:24 PM IST
Nani 14 reels entertainment new movie launched

నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలకు మంచి టాక్ లభించినప్పటికీ, కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేకపోయాయి. దీంతో నాని మళ్లీ ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నాని హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమయ్యింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

నాని ప్రస్తుతం ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Hanu Raghavapudi  14 Reels Entertainments  Movie Launch  

Other Articles