Gopi mohan comments on Ram charan tej

Gopi mohan comments on ram charan tej

Gopi mohan tweets on Ram charan Energy, Gopi mohan tweets on Ram charan, Ram charan movie news, Ram charan movie updates, Ram charan movie stills, Ram charan details, Ram charan shooting news, Ram charan

Gopi mohan comments on Ram charan tej: Ram charan latest film shooting under srinu vaitla direction. Gopi mohan, kona venkat script writers. Rakul preet singh heroine.

చెర్రీని చూసి లవ్ లో పడ్డానంటున్న ప్రముఖ రచయిత

Posted: 06/22/2015 11:07 AM IST
Gopi mohan comments on ram charan tej

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై ప్రముఖ టాలీవుడ్ స్టార్ రైటర్ గోపి మోహన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గోపి మోహన్, కోన వెంకట్ లు సంయుక్తంగా కథను అందిస్తున్నారు. అయితే శ్రీనువైట్లతో కోనవెంకట్, గోపిమోహన్ లకు వివాదం ఏర్పడి విడిపోయారు.

కానీ వీరి కలయికలో మంచి హిట్ చిత్రాలొచ్చాయి. అందుకే ఈ ముగ్గురిని చరణ్ తన సినిమాతో కలిపేసాడు. కానీ ఈ కలయిక విషయం పక్కనపెడితే.. గోపిమోహన్, కోన వెంకట్ లు మాత్రం తమ వృత్తికి సరైన న్యాయం చేస్తూ, వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చరణ్ సినిమాకు సంబంధించిన రషెస్ చూసాడట గోపి మోహన్.

దీంతో చరణ్ పై గోపి ప్రశంసలు కురిపించేస్తున్నాడు. ఇటీవలే చరణ్ కొత్త సినిమా రషెస్ చూసానని, చూసి చాలా థ్రిల్ అయ్యానని తెలిపాడు. ఇలాంటి సినిమాకు రైటర్ గా పనిచేయడం చాలా సంతోషంగా వుందని, శ్రీనువైట్ల ప్రతి సీన్ ను ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో చాలా చాలా స్టైలిష్ గా, సూపర్బ్ గా వున్నాడని, అతని స్టైల్, డాన్సుల్లో ఎనర్జీ చూసి అతనితో లవ్ లో పడిపోయానంటూ చెప్పుకొచ్చాడు.

అంతే కాకుండా ఈ సినిమాకు హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తన ఫ్రెష్ నెస్ ను జతచేసిందని, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగుందంటూ గోపి మోహన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Gopi mohan tweets on Ram charan Energy-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Gopi mohan  Tweets  Rakul preet singh  

Other Articles