Manchu Vishnu next film Bhakta Kannappa

Manchu vishnu next film bhakta kannappa

Manchu Vishnu as Bhakta Kannappa, Vishnu as Bhakta Kannappa, Bhakta Kannappa 2015, Bhakta Kannappa movie news, Bhakta Kannappa movie updates, Bhakta Kannappa movie details, Bhakta Kannappa, Manchu Vishnu latest news, Manchu Vishnu movie news, Manchu Vishnu movie updates, Manchu Vishnu stills, Manchu Vishnu

Manchu Vishnu next film Bhakta Kannappa: Thanikella bharani latest film Bhakta Kannappa. Manchu vishnu as Bhakta kannappa. 24 frames factory produce this film.

ఇక భక్త కన్నప్ప అవతారంలో మంచు విష్ణు

Posted: 06/15/2015 04:44 PM IST
Manchu vishnu next film bhakta kannappa

ప్రముఖ దర్శక రచయిత, నటుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో నటుడు సునీల్ హీరోగా ‘భక్త కన్నప్ప’ చిత్రం రూపొందనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. సునీల్ ఈ ప్రాజెక్టుకు దూరంగా వుండటంతో తనికెళ్ల భరణి మరో హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. భరణి ప్రయత్నాలకు మంచు విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

మంచు విష్ణు హీరోగా తనికెళ్ల భరణి ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలోని అన్నీ భాషలలో ఏకకాలంలో నిర్మించి, అందించనున్నారు. పరమశివుడి మహాభక్తుడిగా పేరొందిన భక్త కన్నప్ప పాత్రలో గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అద్భుతంగా నటించారు.

భక్త కన్నప్ప అనే పాత్రకు కృష్ణంరాజు సరైన న్యాయం చేసారు. మరి మంచు విష్ణు భక్త కన్నప్పగా ఎలా కనిపించనున్నాడో చూడాలి. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ ఓ హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో కలిసి నిర్మించబోతున్నట్లుగా డా.మోహన్ బాబు తెలియజేసారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Bhakta Kannappa  Tanikella Bharani  Movie news  

Other Articles