Sunil Varma has given green signal for his third movie with director kranthi madhavan | tollywood news

Sunil varma third movie kranthi madhavan malli malli idi rani roju director

sunil varma third movie kranthi madhavan malli malli idi rani roju director : Sunil Varma has given green signal for his third movie with director kranthi madhavan who direct malli malli idi rani roju love movie.

sunil varma third movie kranthi madhavan malli malli idi rani roju director : Sunil Varma has given green signal for his third movie with director kranthi madhavan who direct malli malli idi rani roju love movie.

అదృష్టం అంటే ఇదేనేమో!

Posted: 06/13/2015 01:47 PM IST
Sunil varma third movie kranthi madhavan malli malli idi rani roju director

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కి అదృష్టం కలిసిరావడంతో హీరోగా టర్న్ అయ్యాడు. ఇతని అదృష్టానికి దర్శకధీరుడు రాజమౌళి తోడవ్వడంతో ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దాంతో ఈ హీరోకి వెనువెంటనే ఆఫర్లు వచ్చాయి. అయితే.. అవి బాక్సాఫీస్ దగ్గర అంతగా మ్యాజిక్ చేయకపోవడంతో సునీల్ కెరీర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. రెండేళ్లవరకు ఒక్క ఆఫర్ లేకుండా ఖాళీగా గడిపేయాల్సి వచ్చింది. ఇక ఇతనికి ఆఫర్లు రావేమో? అనే అనుమానాలూ వెల్లువెత్తాయి. అయితే.. ఇంతలోనే ఈ హీరోకి మళ్లీ అదృష్టం తలుపుతట్టింది. అంతే! వచ్చిన ఆఫర్లను ఏమాత్రం వదులుకోకుండా వరుసగా ఒప్పేసుకుంటున్నాడు. ఆమధ్య నెమ్మదించిన ఈ హీరో.. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు.

ప్రస్తుతం సునీల్ ‘జోష్’ ఫేం వాసువర్మ దర్శకత్వంలోను, వంశీ ఆకెళ్ల దర్శకత్వంలోను చెరే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమా షూటింగుల్లో బిజీగా వున్న ఈ హీరో.. అప్పుడే మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశాడని సమాచారం! ఇటీవల ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ వంటి అద్భుతమైన ప్రేమకథాచిత్రాన్ని తీసిన క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సునీల్ అంగీకరించాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పరుచూరి ప్రసాద్ నిర్మించినున్న ఈ చిత్రానికి ‘సంతోషం సగం బలం’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేయించినట్లు సమాచారం! అయితే.. ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఏదేమైనా.. సునీల్ కెరీర్ మళ్లీ ఇలా బిజీగా టర్న్ అవడం నిజంగా అదృష్టమేనని అంతా చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil varma  director kranthi madhavan  malli malli idi rani roju  

Other Articles