Mumbai Girl Disha Patani selected as heroine in puri jagannadh and varun tej latest project | Tollywood

Mumbai girl disha patani in puri jagannadh varun tej project

disha patani news, disha patani, disha patani telugu debut, puri jagannadh, varun tej new movie, puri jagannadh varun, varun tej disha patani, disha patani hot photos, disha patani photo gallery, disha patani stills, disha patani updates, varun tej updates, puri jagannadh updates, hero nitin

Mumbai Girl Disha Patani in puri jagannadh varun tej project : Mumbai Model Disha Patani finally selected as heroine in puri jagannadh and varun tej latest project. This movie produced by C Kalyan.

మెగాహీరో కోసం ముంబై భామని ఇంపోర్ట్ చేసిన పూరీ

Posted: 06/12/2015 11:28 AM IST
Mumbai girl disha patani in puri jagannadh varun tej project

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలందరిలో దాదాపు చాలావరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయినవారే! ఇక్కడి అమ్మాయిలను సినిమాల్లో ఎందుకు తీసుకోవడం లేదనో తెలీదు కానీ.. తెలుగు దర్శకులు మాత్రం కొత్తదనం కోసమంటూ వారినే ఎంచుకుంటుంటారు. ‘ఇంట్లో తినే బిరియానికంటే బయట చేసే భోజనమే బాగుంటుంది’ అన్నట్లుగా తెలుగు ఆడియెన్స్ కూడా ఇంపోర్ట్ తారల రుచి మరిగారు. ఇక ఆడియెన్స్ టేస్ట్ ని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు పూరీ కూడా.. ఆ తరహాలోనే సినిమా సినిమాకి కొత్త తారలను ఎంపిక చేసుకుంటారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా కోసం ఓ ముంబై భామని ఇంపోర్ట్ చేసినట్లు సమాచారం!

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే నితిన్ తో సినిమా క్యాన్సిల్ చేసుకుని మెగాహీరో వరుణ్ తేజ్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే! కొన్ని అనివార్య కారణాల వల్ల నితిన్ క్యాన్సిల్ చేసుకున్న మూవీ కథను పూరీ వరుణ్ తో తీస్తున్నాడు. ముందుగా అనుకున్న తేదీకే ఈనెల 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా పూరీ స్పష్టం చేశాడు. సి.కళ్యాణ్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను చకచకా కానిచ్చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముంబైకి చెందిన దిశా పథానిని ఎంపిక చేసినట్లు సమాచారం! ఈ అమ్మడు ఇప్పటికే పలు ఈవెంట్స్ లో అంధాలభామగా ఎంపికవడంతోపాటు బాలీవుడ్ లో ‘నో సెక్స్ ప్లీజ్’, ‘వీర్ ఆర్ ఇండియన్స్’ అనే అడల్ట్ సినిమాల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disha patani  varun tej  puri jagannadh  

Other Articles