junior ntr and sukumar combo movie nannaki prematho first schedule fix in london | telugu movies | tollywood

Junior ntr sukumar latest movie nannaki prematho london first schedule

junior ntr, director sukumar, rakul preet singh, nannaki prematho movie, jagapathi babu news, junior ntr new movie, sukumar new movie, nannaki prematho updates, rakul preet singh updates, rakul new movie news, devi sri prasad

junior ntrs sukumar latest movie nannaki prematho london first schedule : Tollywood Young Tiger Junior Ntr and Director Sukumar latest project Nannaki prematho will go sets on 25 june. This movie first schedule fix in london.

‘నాన్న’ కోసం లండన్ లో పాగా వేసిన ఎన్టీఆర్

Posted: 06/12/2015 10:48 AM IST
Junior ntr sukumar latest movie nannaki prematho london first schedule

‘టెంపర్’ చిత్రంతో భారీ విజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే! నిజానికి వీరి కాంబో చిత్రం ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సింది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో మూవీ షూటింగ్ ను ప్రారంభించేందుకు యూనిట్ బృందం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఫిలింవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్-సుకుమార్ చిత్రబృందం లండన్ వెళ్లడానికి సిద్ధమవుతోంది. ‘నాన్నకి ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలనలో వున్న ఈ మూవీ షూటింగ్ ఈనెల 25వ తేదీ నుంచి అక్కడే మొదలుకానుంది. ఆరోజు నుంచి రెగ్యులర్ గా దాదాపు 45 రోజులపాటు షూటింగ్ కొనసాగుతుందని యూనిట్ వెల్లడించింది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ గతంలో మునుపెన్నడూలేని విధంగా సరికొత్త గెటప్ లో కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బబ్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా మెరువనుంది.

ఇకపోతే.. ఈ మూవీ టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపెట్టే కథాంశమని ఇట్టే అర్థమవుతోంది. పూర్తి ఫ్యామిలీ నేపథ్యంలో కొనసాగుతుందని స్పష్టమవుతోంది. అయితే.. ఎన్టీఆర్ కి తండ్రిగా ఎవరు నటించనున్నారన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే వుంది. ఇందులో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అధికారికంగా వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  sukumar  nannaki prematho  jagapathi babu  rakul preet singh  

Other Articles