Balakrishna | naughty | anjali | dictator

Balakrishna naughty with actress anjali

Balakrishna naughty with heroine anjali, Balakrishna naughty with anjali, Balakrishna romance with heroine anjali, Balakrishna anjali naughty video, Balakrishna anjali video, Balakrishna dictator movie launch, Balakrishna dictator launch video, Balakrishna dictator movie updates, Balakrishna dictator movie stills, Balakrishna dictator

Balakrishna naughty with actress anjali: Nandamuri balakrishna upcoming film dictator. anjali heroine. Balakrishna naughty with heroine anjali in dictator movie launch.

బాలయ్య గిల్లుడికి అంజలి అబ్బా అన్నదోచ్!

Posted: 06/04/2015 04:14 PM IST
Balakrishna naughty with actress anjali

‘లయన్’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అయితే బాలయ్య ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వయసు పెరుగుతున్న కూడా ఇప్పటికీ కూడా బాలయ్య యువకుడి వలే అందరితో సరదాగానే వుంటాడు. సినిమాల్లోనే కాదు బయట పలు కార్యక్రమాల్లో కూడా నేటి యువత వలే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలే మేముసైతం కార్యక్రమంలో తన సినిమాలోని పాటలను పాడి అందరిని హూషారెత్తించారు.

అందరితో త్వరగా కలిసిపోయే బాలయ్య తాజాగా హీరోయిన్ అంజలితో చిలిపిగా గిల్లాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘డిక్టేటర్’ చిత్ర ముహూర్త కార్యక్రమం తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ తో పాటు హీరోహీరోయిన్లు బాలకృష్ణ, అంజలిలు కూడా పాల్గొన్నారు.

ఈ సమయంలో బాలయ్య, అంజలిల మధ్య ఏదో సరదా టాపిక్ రావడంతో.. అంజలిని బాలయ్య సరదాగా చేతిని గిల్లాడు. ఈ సన్నీవేశాన్ని మీడియా వారు చిత్రీకరించేసారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కానీ ఈ విషయంపై ఎవరూ కూడా నెగెటివ్ గా కామెంట్లు చేయడం లేదు. ఎందుకంటే బాలయ్య అందరితో సరదాగా వుంటాడనే విషయం తెలుసు. పైగా ఆ వీడియోలో అంతగా నెగెటివ్ గిల్లుడు లాంటి సన్నీవేశాలు కూడా లేవు. కాబట్టి అందరూ చూసి నవ్వుకుంటున్నారు.

బాలయ్య, అంజలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: థమన్ అందిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Video source: Sanjay Saahu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna naughty  anjali  dictator  

Other Articles