Akash Puri | actor Akash Puri | Andhra Pori

Akash puri talks about his cine career

Akash Puri latest news, Akash Puri latest interview, Akash Puri movie news, Akash Puri movie updates, Akash Puri stills, Akash Puri movies, Akash Puri latest updates, Akash Puri

Akash Puri talks about his cine career: actor Akash Puri latest film Andhra Pori. this Movie will be release on 5 june. ulka gupta heroine.

మూడేళ్ల వరకు సినిమాలకు బ్రేక్ అంటున్న ఆకాష్ పూరీ

Posted: 06/04/2015 10:18 AM IST
Akash puri talks about his cine career

దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఆంధ్రాపోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక మరో మూడేళ్ల వరకు సినిమాలే చేయనంటున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానంటున్నాడు. ప్రస్తుతం ‘ఆంధ్రాపోరి’ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సంధర్భంగా ఆకాష్ పూరీ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను నటించిన సినిమా విడుదలయ్యాక ఏ చిత్రంలో కూడా నటించనని తెలిపాడు. ఈ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఈ మూడేళ్ల గ్యాప్ లో బ్యాంకాక్ లో ఫైట్స్ నేర్చుకొని, న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి పూరీ జగన్నాద్ దర్శకత్వంలో మళ్లీ అసలు హీరోగా ఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చాడు. చరణ్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్లుగా, ఆకాష్ పూరీ కూడా ఏదో ఒక ‘చిరుత’ లాంటి మాస్ కమర్షియల్ చిత్రంతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

ప్రస్తుతం ఆకాష్ పూరీ, ఉల్కాగుప్తా జంటగా నటించిన ‘ఆంధ్రాపోరి’ టైటిల్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు కోర్టుకెక్కారు. ఈ వివాదంపై నేడు కోర్టు తీర్పునివ్వనుంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన పాటలు ఇటీవలే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి హీరోగా ఆకాష్ పూరీకి ఈ ‘ఆంధ్రాపోరి’ ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akash Puri  Andhra Pori  interviews  stills  

Other Articles