Adivi sesh | voice | Asura film

Adivi sesh voice over to asura film

Asura vioce over, adavi sesh vioce over, Asura movie news, Asura movie updates, Asura movie stills, Asura movie posters, Asura trailer, Asura songs, Asura

Adivi sesh voice over to Asura film: Actor Adivi sesh voice over to nara rohit latest film asura. krishna vijay director. Asura film news, gossips, stills, posters, trailers, gallery.

అడవి శేష్ వాయిస్ ఓవర్ తో అసుర ఎంట్రీ

Posted: 06/04/2015 09:46 AM IST
Adivi sesh voice over to asura film

‘అసుర’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అడవి శేష్ వాయిస్ ఓవర్ ను అందించారు. నారా రోహిత్, ప్రియా బెనర్జీ జంటగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే ‘అసుర’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. ఇందులో నారా రోహిత్ ఓ పవర్ ఫుల్ జైలర్ పాత్రలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రానికి ప్రముఖ నటుడు అడవి శేష్ వాయిస్ ఓవర్ ను అందించాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ నటుడిగా మారిపోయిన అడవి శేష్... ‘అసుర’ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాలని నారా రోహిత్ కోరడంతో వెంటనే అంగీకరించాడు. ఈ చిత్రాన్ని జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asura  adavi sesh  vioce over  release date  

Other Articles