samantha ruth prabhu expressed her feelings about movie success and failures | Kollywood

Samantha ruth prabhu feeling more tension about her films successes

samantha news, samantha ruth prabhu, samantha hot photo shoot, samantha gallery, samantha photo news, samantha updates, samantha movies, samantha interview, samantha hot sizzling

samantha ruth prabhu feeling more tension about her films successes : Samantha ruth prabhu saying that she is also feels more tension when her movie will release.

‘కాస్త టెన్షన్.. ఇంకాస్త జాగ్రత్త’ అంటున్న సమంతా

Posted: 06/02/2015 07:37 PM IST
Samantha ruth prabhu feeling more tension about her films successes

కోరుకున్నవన్నీ లభించినప్పటికీ.. ప్రతిఒక్కరి మనసులో ఏదో ఒక ఆవేదన కలచివేస్తూ వుంటుంది. రోజంతా సమయం ఎంతో సంతోషంగా గడిచినప్పటికీ.. రాత్రి నిద్రపోవడానికి, కళ్లు మూసుకోవడానికి మధ్య మెదడులో టెన్షన్ మెదులుతుంటుంది. తమ భవిష్యత్తు ఎలా వుంటుందోనన్న ఆలోచనే వారిని అలా తీవ్ర ఆలోచనలో పడేస్తుంది. అదెలాఅంటే.. సంతోషంగా గడుపుతున్నప్పుడు ఏమైనా చెడు వార్తలు వినాల్సి వస్తుందేమో..? చేస్తున్న కార్యక్రమంలో లోపాలేమైనా వున్నాయేమో?.. ఇలా రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. ఈ విధంగా తాను కూడా ప్రతిక్షణం టెన్షన్ పడుతూ వుంటానంటోంది సమంత!

చూడటానికి తాను ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపిస్తూ వుంటానని కానీ.. తనకూ అందరిలాగే చాలా టెన్షన్ వుందని సమంతా చెబుతోంది. ఇదేంటీ.. అందం, ఐశ్వర్యం అన్నీ వున్న ఈ అమ్మడికి దేని గురించి టెన్షన్? అని అనుకుంటున్నారా? ఈమె అంతగా టెన్షన్ పడుతున్నది తన సినిమా జయాపజయాల గురించేనని ఆమె వెల్లడిస్తోంది. తన ప్రతి సినిమాకి విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ తాను టెన్షన్ పడుతూ వుంటాననీ, రిలీజ్ రోజున మొదటి ఆట పూర్తి కాగానే పబ్లిక్ టాక్ గురించి ఆరాతీస్తూ వుంటానని అమ్మడు అంటోంది. సినిమా బాగోలేదని టాక్ వస్తే మరోసారి అలాంటి కథను ఎంచుకోకూడదని, ఒకవేళ బాగుందని టాక్ వస్తే ఈసారి మరింత జాగ్రత్తగా వుంటూ ఇంకా ఎక్కువ కష్టపడాలని అనుకుంటానని అమ్మడు చెప్పుకొచ్చింది.

సినిమా ఫలితం కెరీర్ ని ప్రభావితం చేస్తుంది కాబట్టి.. వాటి జయాపజయాల విషయంలో కాస్ట టెన్షన్ గా, ఇంకాస్త జాగ్రత్తగా వుంటానని సమంతా పేర్కొంది. దీనిని బట్టి చూస్తుంటే.. అమ్మడి సక్సెస్ మంత్రం ఇదేనని ఇట్టే తెలిసిపోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  telugu heroines  tollywood  

Other Articles

Today on Telugu Wishesh