Young Hero Nikhil to Romance Nanditha in Sankarabharanam Movie | Kona venkat | Tollywood

Nikhil romance nanditha sankarabharanam movie kona venkat

nikhil, sankarabharanam, kona venkat, nanditha, telugu movies, nikhil movies, nanditha hot photos, nanditha hot photo shoot, nanditha movies list, nanditha filmography, nanditha history

Nikhil Romance Nanditha Sankarabharanam Movie Kona venkat : Successful Hero Nikhil to romance Nanditha in his latest flick Sankarabharanam which is produced by kona venkat.

‘డాష్ డాష్’ హీరోయిన్ తో నిఖిల్ రొమాన్స్

Posted: 06/02/2015 04:59 PM IST
Nikhil romance nanditha sankarabharanam movie kona venkat

విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ హీరో నిఖిల్ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాల హ్యాట్రిక్ విజయంతో ఫుల్ జోష్ లో వున్న ఈ యువహీరో.. ప్రస్తుతం ‘శంకరాభరణం’ చిత్రంలో నటించనున్నాడు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా కొంతమంది కథానాయికలను యూనిట్ బృందం పరిశీలించింది. అయితే.. చివరికి ఈ అవకాశం ‘నందిత’ను వరించింది.

‘నీకు నాకు డాష్ డాష్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నందిత.. ‘ప్రేమ కథా చిత్రం’తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీతో మంచి నటిగా గుర్తింపు పొందిన ఈ అమ్మడికి.. వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలో నటిస్తున్న నందిత.. తాజాగా ‘శంకరాభరణం’ సినిమాలో నాయికగా ఎంపికైంది. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను కోన వెంకట్ నిర్మాణంలో ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ ప్రారంభం కానుంది.

ఇదిలావుండగా.. హ్యాట్రిక్ విజయంతో ఫుల్ జోష్ లో వున్న హీరో నిఖిల్.. ఈ ‘శంకరాభరణం’ కూడా తన విజయాల జాబితాలో చోటు సంపాదించుకుంటుందని పూర్తి విశ్వాసంతో వున్నట్లు తెలుస్తోంది. అటు.. నందిత కూడా ఈ చిత్రం తన కెరీర్ కి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తోంది. మరి.. వీరిద్దరి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nikhil  sankarabharanam  kona venkat  nanditha  

Other Articles