manchu manoj latest movie project with director eshwar launched | tollywood news | telugu movies

Manchu manoj latest movie director eshwar project two heroines tollywood news

manchu manoj, manoj latest news, manchu manoj movie, manchu manoj wife, manoj marriage, manoj pranathi marriage, manoj eshwar new project, tollywood news

manchu manoj latest movie director eshwar project two heroines tollywood news : Tollywood energetic hero Manchu manoj latest project with director eshwar has launched. In this movie manoj will romance with 2 heroines.

ఇద్దరి భామల నడుమ చేరిన నూతన వరుడు

Posted: 06/02/2015 04:38 PM IST
Manchu manoj latest movie director eshwar project two heroines tollywood news

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ ఇటీవలే తన వదిన ఫ్రెండ్ ప్రణతితో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! అయితే.. పెళ్లి జరిగి నెలరోజులు కూడా కాలేదు.. ఇంతలోనే మనోజ్ ఇద్దరి భామల నడుమ చేరిపోయాడు. వారితో రొమాన్స్ పండించడంతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసం సిద్ధం అయ్యాడు. అంటే.. ఈ హీరో అప్పుడే తన సినిమా పనులలో బిజీ అయిపోయాడు.

వివాహం తర్వాత మంచు మనోజ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ చేతిలో పెట్టాడు. జ్యోత్స్న ఫిలిమ్స్ బ్యానర్ సంస్థలో జస్వంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్త కార్యక్రమాలను ఇప్పటికే జరుపుకుంది. ఈనెల రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం! అయితే.. ఆ ఇద్దరు తారలెవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. బ్రహ్మానందం ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే హీరోయిన్ల పేర్లతోపాటు మరికొంతమంది ప్రముఖ నటీనటుల పేర్లను వెల్లడించనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించనున్నారు.

ఈ మూవీ ముహూర్త కార్యక్రమం ముగిసిన అనంతరం హీరో మనోజ్ మాట్లాడుతూ.. ‘కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ముఖ్యభాగాన్ని దుబాయ్ లో చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని, ఫ్యామిలీకి మెచ్చే సెంటిమెంట్-కామెడీ ఎలిమెంట్స్ వుంటాయని, అలాగే హీరోయిన్లతో మనోజ్ రొమాన్స్ బాగానే పండించే కొన్ని సన్నివేశాలుంటాయని వెల్లడిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  director eshwar  tollywood news  

Other Articles