Manchu Manoj Wedding | Pranathi | live updates

Manchu manoj pranathi wedding updates

Manchu Manoj wedding, Manchu Manoj marriage stills, Manchu Manoj wedding details, Manchu Manoj news, Manchu Manoj stills, Manchu Manoj photos, Manchu Manoj videos, Manchu Manoj wedding special, Manchu Manoj birthday, Manchu Manoj

Manchu Manoj Pranathi Wedding Updates: Manchu manoj wedding today with pranathi. Manchu Manoj latest news, stills, pranathi, birthday, marriage, gallery.

అంగరంగా వైభవంగా మంచు మనోజ్ ప్రణతిల వివాహం

Posted: 05/20/2015 10:26 AM IST
Manchu manoj pranathi wedding updates

మంచు వారింట్లో పెళ్లి సందడి తారాస్థాయికి చేరుకుంది. అతిరథమహారథులు, సినీతారలు, ప్రముఖుల సందడి మధ్య మంచుమనోజ్-ప్రణతిల వివాహం ప్రస్తుతం ఘనంగా జరుగుతుంది. ఈ పెళ్లికి సంబంధించిన లైవ్ కార్యక్రమాన్ని పలు ఛానెల్ వారు ప్రసారం చేస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకను భారీగా నిర్వహిస్తున్నారు.

ఈరోజు మనోజ్ పెళ్లి మాత్రమే కాకుండా... ఈరోజు మనోజ్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ సంధర్భంగా మనోజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్. అయితే మనోజ్ పెళ్లి వేడుకను కనివిని ఎరుగని విధంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, అతిరథమహారథులు, అలాగే సౌత్ ఇండియాలోని పలు అగ్రనటీనటులు, సినీ ప్రముఖులు.. సౌత్ నుంచే కాకుండా ఇండియాలోని పలు ప్రాంతాలలోని అతిరథమహారధులు ఈ యువజంటను ఆశీర్వదించడానికి వస్తున్నారు.

వీరందరిని దృష్టిలో వుంచుకుని ఇప్పటికే కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. అలాగే దాదాపు 7 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు, రాజకీయనాయకులు, మంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే పలు వ్యాపారవేత్తలు సైతం రానున్నారు.

వీరందిరికి సెక్యురిటీ నిమిత్తం మంచు విష్ణు ఇప్పటికే దాదాపు 2500కు పైగా గార్డ్ లను నియమించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఇక పెళ్లి వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. పెళ్లిలో డెకరేషన్ కోసం పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లతో సెట్టింగ్స్ చేయించారు. ఇక దేశవిదేశాలకు సంబంధించిన వంటకాలు అలాగే తెలుగు వంటకాల రుచులతో కూడా అన్ని రకాల వంటకాలను ఈ వేడుకలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. ఇప్పటివరకు ఏ సెలబ్రెటీ కుటుంబంలో జరగనంత గ్రాండ్ గా, అంగరంగ వైభంగా మంచు మనోజ్ పెళ్లిని జరపడానికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కృషిచేస్తున్నారు. ఈ పెళ్లి పనులన్నీ కూడా మంచు విష్ణు స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Wedding  Pranathi  live updates  

Other Articles