Jr Ntr Birthday | AbhayRam | Movie news

Jr ntr birthday special news

Jr Ntr Birthday special, Jr Ntr birthday, Jr Ntr latest stills, Jr Ntr news, Jr Ntr movies, Jr Ntr movie news, Jr Ntr movie updates, Jr Ntr stills, Jr Ntr gallery

Jr Ntr Birthday special news: Young Tiger Ntr Birthday today 20 May. Ntr upcoming movies, news, gossips, stills, gallery.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Posted: 05/20/2015 10:07 AM IST
Jr ntr birthday special news

యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు పరిచయం అనవసరం. తెలుగు ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరికీ ఎన్టీఆర్ ఎప్పటికీ సుపరిచితుడే. స్వర్గీయ నందమూరి తారకరామారావుకు మనవడిగా, నటుడు హరికృష్ణ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్... ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 5 స్టార్ హీరోల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు.

నేడు ఎన్టీఆర్ జన్మదినం. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రం ద్వారా బాలనటుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘బాలరామాయణం’ ఎన్టీఆర్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

2001లో ‘నిన్నుచూడాలిని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం1’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో ఎన్టీఆర్ కు భారీ అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సింహాద్రి’ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోవల్సిన పరిస్థితి రాలేదు.

ఇక అప్పటినుంచి నటుడిగా, డాన్సర్ గా, మాస్ హీరోగా ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకునే వుంటున్నాడు. ఇటీవలే విడుదలైన ‘టెంపర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇలాగే ఎన్టీఆర్ తన సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr Ntr  Birthday  AbhayRam  Movie news  

Other Articles