Ram | Pandaga Chesko | Release Date

Pandaga chesko release date confirmed

Ram Pandaga Chesko Movie Release Date, Pandaga chesko release date, Pandaga chesko movie news, Pandaga chesko movie stills, Pandaga chesko stills, Pandaga chesko latest news, Pandaga chesko movie updates, Pandaga chesko

Pandaga Chesko Release Date Confirmed: Ram latest movie Pandaga chesko. gopichand malineni director. thaman music. movie release on 29 may

మే 29న పక్కాగా రానున్న పండగచేస్కో

Posted: 05/18/2015 11:02 AM IST
Pandaga chesko release date confirmed

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా రకూల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పండగచేస్కో’. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

గతకొద్ది కాలంగా అసలే హిట్లులేని రామ్... ఈ ‘పండగచేస్కో’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించనుందని చిత్ర యూనిట్ పూర్తి నమ్మకంతో వున్నారు. అలాగే బ్రహ్మనందం కామెడీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కానుందని చిత్ర యూనిట్ అంటున్నారు. మరి ‘పండగచేస్కో’ రామ్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Pandaga Chesko  Release Date  Trailer  

Other Articles