comedian actor dhanraj shares his childhood memories

Dhanaraj shares his childhood memories

comedian actor dhanraj shares his childhood memories, dhanaraj shares his childhood memories, comedian actor dhanraj, kabadhar dhanraj, tollywood actor, dhanraj childhood memories

comedian actor dhanraj shares his childhood memories

అప్పట్లోనే సినిమా చూపించి.. సంతోషపడ్డా..

Posted: 05/17/2015 07:14 PM IST
Dhanaraj shares his childhood memories

‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రం చూసినవారికి బాగా గుర్తుండిపోయిన నటుడు ‘ధన్‌రాజ్’. బక్కపలచగా ఉన్నా వంద చపాతీలు తింటానని పందెం కాసి గెలిచి.. హోటల్ యజమాని లెక్క తప్పాడని మరలా మొదటి నుంచి పందెం ప్రారంబిద్దామని అమాయకంగా మొహం పెట్టి చెప్పడం తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బనవ్విస్తుంది. అలాంటి నటుడు తాజాగా ఓ ప్రముఖ చానెల్ లో ప్రతీ వారం తన టీమ్ తో వచ్చి ఖబ్డదార్ అంటూ నవ్వించడం మనం మర్చిపోలేం. అటు సినిమాలతో పాటు ఇటు బల్లితెరపై కూడా బిజీగా మారిన ధన్‌రాజ్ తన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.

 ఆ విషయాలు ఆయన మాటల్లోనే..‘నాన్న లారీ డ్రైవర్ కావడంతో విజయవాడ, నెల్లూరు, తెనాలి, గుంటూరు ఇలా చాలా ఊళ్లలో వేసవి సెలవులు గడిపాను. సెలవులిచ్చారంటే చాలు ఉదయం బయటకు వెళితే ఇంటికి చేరేది రాత్రికే. ఆటలన్నీ సినిమా చుట్టూనే తిరిగేవి. వాడేసిన ఫిల్మ్‌ల్ని సేకరించి ఫిల్మ్ బాక్సులో పెట్టి అందరికీ చూపించేవాడిని. సినిమా రీళ్లను కత్తిరించి వాటిమధ్య చీపురుపుల్లలు పెట్టి భూతద్దంతో సూర్యకాంతిని ఫోకస్ చేసి తెల్లకాగితంపై అందరికీ చూపించి సరదాపడేవాడిని. సందర్భానుసారం డైలాగ్స్ కూడా నేనే చెప్పేవాడిని. ఎండ తగ్గితే చాలు ఈతపళ్లు ఏరుకుని కాలువ గట్టుని కూర్చుని తినడం మరిచిపోలేని అనుభూతి. ఈత నేర్చుకుందాం అనుకున్నా. ఓ సారి కృష్ణానదిలో మునిగిపోయా. నీటిగండం ఉందని తెలిసి ఈత జోలికి పోలేదు’ అంటూ ముగించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanaraj  jabardasth  tollywood actor  

Other Articles