Nassar | Bijjaladeva | Bahubali

Nassar bijjaladeva first look poster released

Nassar Bijjaladeva‬ First Look, Nassar as Bijjaladeva‬, Nassar latest stills, Nassar posters, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Nassar

Nassar Bijjaladeva‬ First Look Poster Released: Actor Nassar latest Upcoming movie Bahubali. Nassar as Bijjaladeva‬ in baahubali. Director SS Rajamouli. Prabhas, anushka, rana, tamanna acts in lead roles.

ఈ బిజ్జాలదేవ లుక్ ను ‘దమ్ము’లో చూసినట్లుగా వుంది కదా!

Posted: 05/13/2015 05:10 PM IST
Nassar bijjaladeva first look poster released

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవలే మే 1వ తేది నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, ప్రభాకర్ ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. అయితే నేడు తాజాగా ఇందులో నాజర్ నటించిన ‘బిజ్జాలదేవ’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే ‘దమ్ము’ సినిమాలో నాజర్ వేషాదారణ కూడా ఇదేవిధంగా వుంటుంది. కాకపోతే ‘దమ్ము’ సినిమాలో తెల్లని వెంట్రుకలు వుంటాయి. కానీ ఈ సినిమాలో నల్లని వెంట్రుకలున్నాయి. ఈ పోస్టర్లో గ్లాస్ పట్టుకున్న విధానం, ఆ స్టైల్ కూడా అలాగే వుంది. ఈ బిజ్జాలదేవ పోస్టర్ పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి.

అయినా పోస్టర్లది ఏముంది,, సినిమాలో పాత్ర నటన పరంగా బాగుంటే చాలు అనే విధంగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 31న థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Nassar Bijjaladeva First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nassar  Bijjaladeva?  First Look poster  Bahubali  

Other Articles