Manchu Vishnu | Clarifies | Singham 123

Manchu vishnu clarifies on singham 123 trailer

Manchu Vishnu Clarifies on Singham 123 Trailer, Singham 123 Theatrical Trailer, Sampoornesh Babu Singham 123 Theatrical Trailer, Singham 123 First Look, Singham 123 First Look poster, Singham 123 poster, Singham 123 First Look news, Singham 123 movie news, Singham 123 news, Sampoornesh babu, Sampoornesh babu Singham 123, Manchu Vishnu Singham 123

Manchu Vishnu Clarifies on Singham 123 Trailer: Burning star new movie Singham123. Here is the latest updates of Sampoornesh babu latest film Singham 123. First look poster of sampu Singham 123

ఈ సింగం అంతా కామెడీ కోసమేనట

Posted: 05/13/2015 04:28 PM IST
Manchu vishnu clarifies on singham 123 trailer

మెగా బర్నింగ్ సూపర్ స్టార్ సంపూర్ణేష్ బాబుపై ఇతర హీరోల అభిమానులు మండిపడుతున్నారు. సంపూ చెప్పిన డైలాగ్ ఇపుడు భారీగా హాట్ టాపిక్ గా మారింది. సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం123’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ చాలా రోజుల క్రితమే విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో సంపూ ఓ సన్నీవేశంలో ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ ఆవేశంగా డైలాగ్ చెబుతాడు. అయితే ఈ డైలాగ్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై సెటైర్ వేసే విధంగా వున్నట్లుగా అభిమానులు మండిపడుతున్నారు.

ఈ డైలాగ్ మాత్రమే కాకుండా ఇలాంటివి చాలా డైలాగులు కూడా ఇతర స్టార్ హీరోలను కించపరిచే విధంగా, వారిపై వ్యంగ్యంగా వున్నట్లుగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య పెద్దది కాకముందే ‘సింగం123’ చిత్ర నిర్మాత మంచు విష్ణు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

ఈ విషయంపై మంచు విష్ణు ఓ క్లారిటీ ఇచ్చారు. “సింగం 123 ఒక ఔట్ అన్డ్ ఔట్ కామెడీ షో. ఎవరినో కించపరచాలన్న ఆలోచనలో ఈ సినిమా చేయలేదు. సరదాగా ప్రేక్షకుడు నవ్వుకోడానికే ఈ ప్రయత్నం చేశాం. అభిమానులు అర్థం చేసుకుంటారనుకుంటున్నా” కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖర్లో విడుదల కానుంది.

ఈ విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ... ఈ సినిమా ద్వారా ఎవరినో కించపరచాలన్న ఆలోచనతో తీయలేదు. కేవలం ప్రేక్షకులు ఆనందంగా నవ్వుకొని ఎంజాయ్ చేయడానికే ‘సింగం123’ పేరుతో పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా రూపొందించాం. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అక్షత్ అజయ్ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Clarifies  Singham 123  Trailer  

Other Articles