Katrina Kaif spokesperson Has Denies the Marriage News With Ranbir Kapoor | Bollywood News

Katrina kaif spokesperson denies marriage news ranbir kapoor

katrina kaif news, ranbir kapoor news, katrina ranbir marriage, katrina kaif marriage, ranbir kapoor marriage, katrina spokesperson, bollywood love birds, bollywood news, bollywood gossips, tollywood updates

Katrina Kaif spokesperson Denies Marriage News Ranbir Kapoor : “There is no truth to these wedding dates, there are no plans as yet,” the spokesperson said in a media statement, adding the actress has a packed month.

కత్రినాకు పెళ్లా? తూచ్.. అవన్నీ గాలివార్తలు!

Posted: 05/12/2015 08:12 PM IST
Katrina kaif spokesperson denies marriage news ranbir kapoor

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలన జంటగా పేరొందిన కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ల ప్రేమ వ్యవహారానికి సంబంధించి తాజాగా సంచలన వార్త వెలువడింది. గతకొన్నాళ్ల నుంచి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వస్తున్న రకరకాల పుకార్లపై చివరికీ ఫుల్ స్టాప్ పడింది.

మొన్ననే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రణబీర్ స్వయంగా వెల్లడించాలని బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం ఇద్దరూ బిజీగా వున్నామని.. వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటామని రణబీర్ స్పస్టం చేసినట్లు ప్రచారాలూ సాగాయి. అయితే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలపై ఏమాత్రం వాస్తవం లేదని కత్రినా ప్రతినిధి తెలిపారు.

ఈ విషయంపై కత్రినా ప్రతినిధి మాట్లాడుతూ.. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పస్టం చేశారు. వారిద్దరి పెళ్లికిగానీ, ఎంగేజ్ మెంట్ కిగానీ ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేయలేదని.. వారి పెళ్లిపై వస్తున్న కథనాలన్నీ గాలివార్తలేనని ఆయన రూమర్లను ఖండించారు. మరి ఇతని స్పష్టతపై రణబీర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు కత్రినా కైఫ్ ఫ్రాన్స్ లోని రివెరా వెళ్లింది. మరోవైపు.. అభిషేక్ బచ్చన్ తో ‘ఫతూర్’, రణబీర్ కపూర్ తో ‘జగ్గా జాసూస్’ వంటి సినిమాల షూటింగులతోనూ బిజీగా వుంది. అయితే.. తన పెళ్లి విషయానికి సంబంధించి మీడియాలో తండోపతండాలుగా వార్తలొస్తున్నా కత్రినా కైఫ్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Ranbir Kapoor  Bollywood news  

Other Articles