Bahubali | Bijjaladeva

Bahubali next first look bijjaladeva release today

Bahubali Next First Look Bijjaladeva, Baahubali new posters, Baahubali new look, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie news, Baahubali movie stills, Baahubali movie latest stills, Baahubali movie latest updates, Baahubali, Prabhas, Ramya krishna

Bahubali Next First Look Bijjaladeva Release Today: Tollywood director Rajamouli latest movie Bahubali. Prabhas, anushka, rana, tamanna acts in lead roles. Keeravani music.

ఈ కటౌట్ ఎలా వుండబోతుందో చూడాలి!

Posted: 05/13/2015 10:13 AM IST
Bahubali next first look bijjaladeva release today

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే పలు నటీనటుల పోస్టర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి, శివుడు పాత్రలలో ప్రభాస్ నటిస్తున్నాడు. దేవసేన గా అనుష్క, భల్లలాదేవగా రానా, అవంతికగా తమన్నాలు నటిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలై భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

అయితే ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించిన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ దర్శకుడు ఓ కొత్త ప్రమోషన్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇందులో శివగామిగా రమ్యకృష్ణ, కాళకేయగా ప్రభాకర్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తర్వాత విడుదలవ్వబోయే పోస్టర్ గురించి రాజమౌళి ముందుగానే ప్రకటించాడు.

తర్వాత బిజ్జలదేవ అనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ పాత్రకు తమిళంలో పింగళతేవన్ అనే పేరు పెట్టారు. ఈ ఫస్ట్ లుక్ నేడు విడుదల చేయనున్నారు. మరి ఈ పాత్రలో ఎవరు నటించారో, ఈ పాత్ర ఫస్ట్ లుక్ ఎలా వుండబోతుందో మరికొన్ని గంటల్లో తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Bijjaladeva  Prabhas  Rajamouli  

Other Articles