Ravi teja | Kick2 | audio launched

Ravi teja kick2 movie audio launched

Today Ravi teja Kick2 audio launch, Ravi teja Kick2 movie stills, Ravi teja Kick2 movie posters, Ravi teja Kick2 movie teaser, Ravi teja Kick2 movie trailer, Ravi teja Kick2 movie first look, Ravi teja Kick2 movie news, Ravi teja Kick2 movie updates, Ravi teja Kick2 movie date

Ravi teja Kick2 Movie audio launched: Thaman kick2 audio release today evening. Ravi Teja and Surender Reddy are going to entertain the audiences once again with 'Kick 2'. Nandamuri kalyan ram producer. Thaman music. rakul preet singh heroine.

ఘనంగా రవితేజ కిక్ 2 ఆడియో విడుదల

Posted: 05/11/2015 09:47 AM IST
Ravi teja kick2 movie audio launched

మాస్ మహారాజ రవితేజ హీరోగా, సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిక్2’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ఆడియోను సిడీని విడుదల చేసారు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ... రవితేజ చాలా కష్టపడే మనిషి అని, తనని ‘ఇడియట్’ చిత్ర సమయం నుంచి చూస్తున్నానని.. రవితేజ ఎప్పడూ కూడా ఇలాగే కష్టపడుతూ, ఇదే ఎనర్జీతో మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.

అలాగే కష్టపడాలి అనే వ్యక్తుల్లో కళ్యాణ్ అన్నయ్య (కళ్యాణ్ రామ్) ఒకరు. ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ తనయుడిగా ఎప్పుడూ ఫీల్ అవలేదు. కేవలం తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని పైకొస్తున్నాడు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. పటాస్, టెంపర్ తర్వాత వస్తున్న ఈ కిక్2 సినిమాతో అన్నయ్య కళ్యాణ్ రామ్ ముఖంలో చిరునవ్వు అలాగే ఉండాలి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నారు.

అలాగే రవితేజ మాట్లాడుతూ... కిక్ 2 సినిమా అందరికి డబుల్ కిక్ ను ఇస్తుంది. నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. అన్ కాంప్రమైజ్డ్ నిర్మాత. ఇక దర్శకుడు సురేంధర్ రెడ్డితో కిక్ సినిమా ద్వారా ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. ఆరేళ్ల తర్వాత కిక్ 2 చేస్తున్నాం. అన్నీ కుదిరితే కిక్2 కూడా చేయడానికి సిద్ధమే. రకూల్ ప్రీత్ సింగ్ కు మంచి ఫ్యూచర్ వుంది. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది అని అన్నారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... సురేంధర్ రెడ్డి, రవితేజ గారు కథ వినగానే వెంటనే ఒప్పుకున్నారు. మా బ్యానర్లో వస్తున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందనే నమ్మకం వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi teja  Kick2  audio songs  Rakul preet singh  

Other Articles