Puri Jagannadh | Chiranjeevi 150 film | movie news

Puri jagannadh to direct chiranjeevi 150 film

Puri Jagannadh To Direct Chiranjeevi 150 Film, Chiranjeevi 150 Film news, Chiranjeevi 150 Film updates, Chiranjeevi 150 Film director, Chiranjeevi 150 Film stills, Chiranjeevi 150 Film details, Puri Jagannadh latest news, Puri Jagannadh movie news, Puri Jagannadh movie updates, Puri Jagannadh stills, Puri Jagannadh

Puri Jagannadh To Direct Chiranjeevi 150 Film: Mega star Chiranjeevi's 150th movie is going to be directed by Puri Jagannadh. The movie will be launched on Chiranjeevi's birthday August 22.

పూరీ దర్శకత్వంలో చిరు 150వ చిత్రం ఖరారు

Posted: 05/11/2015 10:16 AM IST
Puri jagannadh to direct chiranjeevi 150 film

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడూ ప్రారంభం అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతకొద్ది కాలంగా వారి ఆశలపై మెగా ఫ్యామిలీ ‘త్వరలోనే...’ అంటూ నీళ్లు చల్లుతున్నారు. అయితే చిరంజీవి 150వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారనే విషయంపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి.

వి.వి.వినాయక్, పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల వంటి పలు దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ వారెవరూ కూడా ఓకే అవ్వలేదు. దర్శకుడిగా వినాయక్ దాదాపు ఖరారు అయినట్లుగా కూడా వార్తలొచ్చాయి. కానీ చివరకు వినాయక్ కూడా ఈ ప్రాజెక్టు చేయట్లేదని తేలిపోయింది.

అయితే తాజాగా చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు పూరీ జగన్నాథ్ అని ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని టాలీవుడ్ సినీ పిఆర్వో బిఏ రాజు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ పూరీ మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

దర్శకుడు ఓకే అయ్యాడు.. మరి సినిమా ఎలా వుండబోతుందోనని అభిమానులు తెగ ఆతృతగా వున్నారు. పూరీ ఎలాంటి కథతో చిరు 150వ చిత్రాన్ని రెఢీ చేయనున్నాడని మెగా అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ విషయంపై రాంచరణ్ మాత్రం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసాడు. గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా చరణ్ ఈ విషయంపై స్పందించాడు.

చరణ్ మాట్లాడుతూ... చిరంజీవి 150వ సినిమాకు ఇంకా సరైన కథ సిద్ధం కాలేదు. కానీ... కత్తులు పట్టుకొని, తొడలు కొట్టుకుంటూ, మీసాలు తిప్పుకుంటూ వుండే యాక్షన్ సినిమాగా మాత్రం అస్సలు వుండదు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ మంచి కుటుంబ కథాచిత్రం, ఎంటర్ టైన్మెంట్ సినిమాతోనే మీ ముందుకు రావాలని అనుకుంటున్నాం. ఆయన 150వ సినిమా మంచి చిత్రంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చాడు.

చిరంజీవి కూడా ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసారు. చిరంజీవి 150వ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించనున్నాడు. చరణ్ తల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి చిరంజీవి 150వ సినిమా విశేషాలన్నీ కూడా త్వరలోనే తెలియనున్నాయి. ఆ వివరాలు మీకు ఎప్పటికప్పుడు అందించనున్నాం. చూస్తూనే వుండండి సినీవిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Chiranjeevi  150 film  movie news  

Other Articles