Nitya menon | Anushka | interview | Rudhramadevi

Nitya menon talks about anushka

Nitya menon talks about anushka, Nitya menon talks about Rudhramadevi, Nitya menon latest interview, Nitya menon latest news, Nitya menon movie news, Nitya menon movie updates, Nitya menon stills, Nitya menon hot stills, Nitya menon

Nitya menon talks about anushka: Actress Nitya menon talks about star heroine anushka. nitya menon latest movie Rudhramadevi.

తాను ఏడంగుళాలు పొట్టి అని ఒప్పుకున్న నిత్యా

Posted: 05/09/2015 04:04 PM IST
Nitya menon talks about anushka

గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో స్మైలింగ్ బ్యూటీ నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలోని తన పాత్ర గురించి నిత్యామీనన్ ఓ కొత్త వార్తను చెప్పుకొచ్చింది.

నిత్యామీనన్ కాస్త ఎత్తు తక్కువే అన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి ఈ అమ్మడిని అనుష్క లాంటి బాగా హైట్ వున్న హీరోయిన్ పక్కన నిలబెడితే ఎలా వుంటుంది చెప్పండి. ఇలాంటి పరిస్థితే ‘రుద్రమదేవి’ సినిమాలో నిత్యామీనన్ కు ఏర్పడిందట. ఇందులో అనుష్క, నిత్యామీనన్ లు తల్లీకూతుళ్లుగా నటించారు. వీరిద్దరిపై ఓ పాటను కూడా చిత్రీకరించారు.

అనుష్కతో నటించే సన్నీవేశాల సమయంలో తాను భారీ హై హీల్స్ వేసుకొని నటించిందట. అనుష్క కంటే తాను ఏడు అంగుళాలు పొట్టిగా వున్నానని నిత్యా చెప్పుకొచ్చింది. అంత ఎత్తున్న హై హీల్స్ వేసుకోవడం తన జీవితంలో మొదటిసారి అని, ఇవి వేసుకొని అనుష్కతో డాన్స్ చేస్తున్న సమయంలో తన కాలు బెణికిందని నిత్యా చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ సమయంలో అనుష్క తనకు చాలా బాగా సపోర్ట్ చేసిందని, తామిద్దరి మధ్య చాలా పోలికలున్నాయని చెప్పుకుంటూ నిత్యా సంబరపడిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitya menon  Anushka  interview  Rudhramadevi  

Other Articles