Ravi teja | Kick2 | audio songs | Rakul preet singh

Ravi teja kick2 audio launch today

Today Ravi teja Kick2 audio launch, Ravi teja Kick2 movie stills, Ravi teja Kick2 movie posters, Ravi teja Kick2 movie teaser, Ravi teja Kick2 movie trailer, Ravi teja Kick2 movie first look, Ravi teja Kick2 movie news, Ravi teja Kick2 movie updates, Ravi teja Kick2 movie date

Ravi teja Kick2 audio launch today: Thaman kick2 audio release today evening. Ravi Teja and Surender Reddy are going to entertain the audiences once again with 'Kick 2'. Nandamuri kalyan ram producer. Thaman music. rakul preet singh heroine.

నేడే రవితేజ కిక్ 2 ఆడియో విడుదల

Posted: 05/09/2015 10:19 AM IST
Ravi teja kick2 audio launch today

హీరో రవితేజ, దర్శకుడు సురేంధర్ రెడ్డి, సంగీత దర్శకుడు థమన్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘కిక్’. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. అయితే మళ్లీ ఇదే కాంబినేషన్లో ‘కిక్2’ చిత్రం తెరకెక్కుతుంది.

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిక్2’. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడని సమాచారం.

రవితేజ, థమన్ కాంబినేషన్లో వస్తున్న ఏడవ చిత్రమిది. పైగా ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. రవితేజ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi teja  Kick2  audio songs  Rakul preet singh  

Other Articles