Trisha | Arnmanai sequel | Siddharth | Kajal Agarwal

Trisha in aranmanai 2 movie

Aranmanai 2 movie cast details, Aranmanai 2 news, Aranmanai 2 latest news, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha latest stills, Trisha hot news, Kajal Agarwal latest news, Kajal Agarwal movie news, Kajal Agarwal hot stills, Kajal Agarwal

Trisha in Aranmanai 2 movie: Director sundar c upcoming movie Aranmanai 2. Trisha, siddartha, kajal, anjali.

త్రిష, కాజల్, అంజలి కాంబినేషన్లో అరణ్మనై 2

Posted: 05/06/2015 11:57 AM IST
Trisha in aranmanai 2 movie

తమిళంలో ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్మనై’ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదల చేసారు. హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మీ, సుందర్, వినయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది.

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సుందర్. ఈ సీక్వెల్ స్టార్ హీరోలను ఎంపిక చేసారు. సిద్ధార్థ, త్రిష, కాజల్ అగర్వాల్, అంజలిలు నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే త్రిష ఖరారు చేసింది. సుందర్ తో తొలిసారి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా వుందంటూ త్రిష తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

‘అరణ్మనై’ చిత్రంలో వున్న నటీనటులు ఈ సీక్వెల్ లో నటించట్లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Arnmanai sequel  Siddharth  Kajal Agarwal  

Other Articles