Lakshmi Manchu | Talk show title | Dongaata

Manchu lakshmi latest talk show title confirmed

Lakshmi Manchu latest talk show title confirmed, Lakshmi Manchu talk show title, Lakshmi Manchu latest news, Lakshmi Manchu movie news, Lakshmi Manchu talk show updates, Lakshmi Manchu latest updates, Lakshmi Manchu news, Lakshmi Manchu mmirr, Lakshmi Manchu hot stills, Lakshmi Manchu stills, Lakshmi Manchu latest stills, Lakshmi Manchu

Manchu Lakshmi latest talk show title confirmed: Lakshmi manchu ready for another talk show. this latest talk show title is Manchu lakshmi tho Malli malli idi rani roju.

మంచు లక్ష్మీ కొత్త టాక్ షో టైటిల్ ఖరారు

Posted: 05/05/2015 04:48 PM IST
Manchu lakshmi latest talk show title confirmed

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు ప్రముఖ నిర్మాత, నటి మంచు లక్ష్మీప్రసన్న ఈమధ్య వరుస సినిమాల ద్వారా సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే కానీ... సినిమాల్లో కంటే ముందుగా ‘ప్రేమతో మీ లక్ష్మీ’ టాక్ షో ద్వారా మంచు లక్ష్మీ టీవి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అయితే ఆ తర్వాత నిర్మాతగా, నటిగా బిజీ అవ్వడంతో టీవి షోలకు దూరమయ్యారు. కానీ మరోసారి తన టాక్ షో ద్వారా అలరించడానికి సిద్దమవుతుంది లక్ష్మీ.

అవును.. ఇటీవలే తన కొత్త చిత్రం ‘దొంగాట’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మీ... ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ‘నేను – మనోజ్ కలిసి జీ టీవిలో ఒక టాక్ షో ప్లాన్ చేస్తున్నాం. ఆ షోకి ‘మంచు లక్ష్మీతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే టైటిల్ పెట్టాము’ అని చెప్పుకొచ్చింది.

గతంలో లక్ష్మీ తన టాక్ షోల ద్వారా సెలబ్రెటీలను ప్రత్యేక ఇంటర్వ్యూలను తీసుకోవడం, వారి వ్యక్తిగత, సినీ జీవితాల గురించి చిట్ చాట్ ద్వారా అందరిని అలరించింది. మరి ఈసారి రాబోతున్న ఈ టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ఈ సంధర్భంగా మంచులక్ష్మీకి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Manchu  Talk show title  Dongaata  

Other Articles