Ram Clarifies | Pandaga chesko | Dialogue Controversy

Ram clarifies pandaga chesko dialogue controversy

Ram Clarifies on Dialogue Controversy, Ram Clarifies on Pandaga Chesko Controversy, Pandaga chesko songs, Pandaga chesko stills, Pandaga chesko movie news, Pandaga chesko movie stills, Pandaga chesko stills, Pandaga chesko latest news, Pandaga chesko movie updates, Pandaga chesko

Ram Clarifies Pandaga Chesko Dialogue Controversy: Ram Pandaga chesko movie trailer released. rakul preet singh, sonal chouhan heroines. gopichand malineni director. thaman music.

ఆ డైలాగ్ ఎవరిని టార్గెట్ చేసినది కాదు: రామ్

Posted: 05/05/2015 04:14 PM IST
Ram clarifies pandaga chesko dialogue controversy

రామ్ హీరోగా నటిస్తున్న ‘పండగ చేస్కో’ చిత్ర థియేటర్ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రస్తుతం రామ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ట్రైలర్లో రామ్ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం ఇతర స్టార్ హీరోల అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా వుండడంతో... ఆ అభిమానులు రామ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై రామ్ స్పందించక తప్పలేదు. అసలు విషయం ఏమిటంటే... ‘పండగ చేస్కో’ థియేటర్ ట్రైలర్లో రామ్ ‘ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో నుంచి వచ్చే దమ్ములో ఉంటది... ఇలాంటి ఎదవ సొల్లు చెప్పడం నాకు చిరాకు రా’ అనే డైలాగ్ చెప్పాడు.

ఈ డైలాగులు గతంలో కొంతమంది స్టార్ హీరోలు చెప్పినవాటికి దగ్గరగా వుండటంతో.. రామ్ కావాలనే తమ అభిమాన హీరోపై విమర్శలు చేసాడంటూ.. సదరు అభిమానులు రామ్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సీరియస్ కాకుండా.. రామ్ ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించాడు.

రామ్ స్పందిస్తూ... ‘జస్ట్ టు క్లారిఫై.. పండగ చేస్కో ట్రైలర్లో ఎవరిని టార్గెట్ చేయలేదు. మన పని మనం చేసుకునే స్కూల్ నాది’ అంటూ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసాడు. మరి ఈ విషయం సద్దుమనుగుతుందో లేదో చూడాలి.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్, సొనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Clarifies  Pandaga chesko  Dialogue Controversy  Trailer  

Other Articles