Pawan Kalyan | die hard fan | west bengal | movie news

Pawan kalyan meets his west bengal die hard fan

Pawan Kalyan meets his west bengal fan, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest news, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan movie details, Pawan Kalyan stills, Pawan Kalyan news, Pawan Kalyan gossips, Pawan Kalyan

Pawan Kalyan meets his west bengal die hard fan: Powerstar pawan kalyan meets his fan from west bengal. his name addanki ravi.

పవర్ స్టార్ కోసం సైకిల్ పై వచ్చిన పశ్చిమ బెంగాల్ అభిమాని

Posted: 05/01/2015 09:43 AM IST
Pawan kalyan meets his west bengal die hard fan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. తన సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వం, నిజాయితీ, సేవాగుణం వంటి పలు మంచి లక్షణాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ను కలవడానికి ఓ అభిమాని ఎంతో కష్టపడ్డాడు.

Pawan Kalyan meets his west bengal fan-02

దాదాపు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసాడు. పశ్చిమ బెంగాల్ ను వచ్చి కలిస్తే అందులో పెద్ద గొప్పతనం ఏముంది.. మేము అమెరికా నుంచి వచ్చి కలుస్తాం అని అంటారా ఏంటి? ఆ అభిమాని పశ్చిమ బెంగాల్ నుంచి సైకిల్ మీదనే వచ్చి పవన్ ను కలిసాడు.

Pawan Kalyan meets his west bengal fan-03

పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నివాసి అయినటువంటి అద్దంకి రవి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా కలవాలని ఉద్దేశ్యంతో గతనెల (ఏప్రిల్) 3వ తేదిన ఖరగ్ పూర్ నుంచి సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు నెలరోజుల అనంతరం నిన్న (ఏప్రిల్ 30) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ను ఆయన కార్యాలయంలో కలిసాడు.

Pawan Kalyan meets his west bengal fan-04

పవన్ కళ్యాణ్ ను కలవాలనే తన కోరికతీరిందని, తన ఆనందం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా వుందని రవి చెప్పుకొచ్చాడు. తనను కలిసిన రవిని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోషంగా ఆహ్వానించాడు. పవన్ తో రవి దిగిన ఫోటోలు మీకోసం అందిస్తున్నాం. చూడండి.

Pawan Kalyan meets his west bengal fan-05

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  meets his fan  west bengal  movie news  

Other Articles