Allu arjun | Boyapati srinu | Ratham title

Boyapati srinu clarifies on allu arjun movie title

Boyapati srinu clarifies on allu arjun movie title Ratham, Allu arjun boyapati srinu movie news, Allu arjun boyapati srinu movie details, Allu arjun boyapati srinu movie pressmeet, Allu arjun movie news, Allu arjun movie stills, Allu arjun songs, Allu arjun, allu arjun stills, allu arjun gossips, allu arjun news, allu arjun updates, allu arjun tweets, allu arjun movies

Boyapati srinu clarifies on allu arjun movie title: Allu arjun next movie with director boyapati srinu. geeta arts banner. allu aravind producing, thaman music director.

బన్నీ టైటిల్ రథం కాదంటున్న బోయపాటి

Posted: 04/29/2015 11:00 AM IST
Boyapati srinu clarifies on allu arjun movie title

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రముఖ కమర్షియల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు.

స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లుగా జతకట్టనున్నారు. ఈ చిత్రానికి ‘రథం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ ఈ పుకార్లను దర్శకుడు బోయపాటి శ్రీను ఖండించారు.

ఈ వార్తలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందిస్తూ... ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ ను అనుకోలేదు. ‘రథం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. త్వరలోనే ఓ టైటిల్ ను ఖరారు చేసి, అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ 8 ప్యాక్ బాడీ గెటప్ లో కనిపించనున్నాడని, ఇందుకోసం బన్నీ కసరత్తులు కూడా ప్రారంభించాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లోని నిజనిజాలు తెలియాలంటే మరికొద్ది కాలం వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Boyapati srinu  Ratham title  News  

Other Articles