Kamal Hassan Told His Latest Movie Will Give Him Jail Sentence | Tamilnadu Clashes

Kamal hassan jail sentence another controversial movie project tamilnadu clashes

Kamal Hassan news, Kamal Hassan updates, Kamal Hassan gallery, Kamal Hassan photo shoot, Kamal Hassan controversies, Kamal Hassan movies list, Kamal Hassan new project, Kamal Hassan controversy projects, tamilnadu clashes, 1968 tamilnadu riots

Kamal Hassan Jail Sentence Another Controversial Movie Project Tamilnadu Clashes : Kamal Hassan in recent press meet told that his latest movie will creates controversy and will give him jail sentence. Because that movie is making based on 1968 tamilnadu riots.

‘నా సినిమా నన్ను జైలుకు తీసుకెళ్తుందేమో’!

Posted: 04/25/2015 02:54 PM IST
Kamal hassan jail sentence another controversial movie project tamilnadu clashes

తన నటనాప్రతిభతో లోకనాయకుడిగా ఎదిగిన సూపర్ స్టార్ కమల్ హాసన్.. సహజత్వానికి దగ్గరగా వుండే సినిమాలను ఎక్కువగా తీస్తుంటారు. అందుకే.. ఈయన చిత్రాలు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతూ వుంటాయి. నిజజీవితంలో జరిగే ఎలిమెంట్స్ ను సినిమాల్లో చిత్రీకరించి చూపిస్తే.. ప్రజల్లో మార్పు రావచ్చునన్న ఉద్దేశంతోనే ఈయన ఆ విధమైన కథలను ఎంపిక చేసుకుంటారు.

ఇప్పటివరకు ఈయన తీసిన ఆవిధమైన చిత్రాలు మొదట ఎన్నో వివాదాలు సృష్టించాయి. అయినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, సినిమాలను రిలీజ్ చేయించి, మంచి విజయాలను అందుకున్నారు కమల్! అయితే.. తాను తీయబోయే తాజా చిత్రం తనను జైలుకి తీసుకెళ్తుందేమోనని స్వయంగా కమల్ ప్రకటించడం సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. కమల్ హాసన్ తాజాగా ఓ వివాదాస్పదమైన ప్రాజెక్టును చేపట్టారు.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులవ్యవస్థను ఎండగడుతూ.. 1968లో తమిళనాడులోని ‘కిళవెన్ మణి’ గ్రామంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి ‘ఉళ్లేన్ అయ్యా’ (ఉన్నానయ్యా) అని టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 44 మంది దళితుల ఊచకోతను చూసిన విద్యార్థి కోణంలో చెప్పేలా కథను సిద్ధం చేసుకున్నానని అన్నారు.

ఈ విధమైన వివాదాస్పద కథతో తీస్తున్న ఈ సినిమా తనను మరిన్ని వివాదాల్లో చిక్కుకుపోయేలా చేస్తుందని.. తమిళనాట తనను జైలుపాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమల్ తెలిపారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Tamil Controversial Movies  1968 Tamilnadu Clashes  

Other Articles