Nitya Menon Sharwanand Husband Wife | Bangalore Days Telugu Remake Movie

Nitya menon sharwanand husband wife bangalore days telugu remake movie

Nitya Menon news, Nitya Menon updates, Nitya Menon controversy, Nitya Menon affairs, Nitya Menon love affairs, Nitya Menon love magic, sharwanand news, sharwanand affairs, sharwanand marriage news, bangalore days telugu

Nitya Menon Sharwanand Husband Wife Bangalore Days Telugu Remake Movie : Nitya Menon and Sharwanand to play Husband Wife roles in Bangalore Days Telugu Remake Movie which is produced by DilRaju

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నిత్యా, శర్వానంద్!

Posted: 04/20/2015 03:53 PM IST
Nitya menon sharwanand husband wife bangalore days telugu remake movie

ఇటీవలే ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో మరుపురాని ప్రేమికులుగా నటించిన నటి నిత్యామీనన్, నటుడు శర్వానంద్ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం! ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి కూడా! ఇద్దరూ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరి పెళ్లి హడావుడి హఠాత్తుగా మొదలైంది. అయితే.. వీరు పెళ్లి చేసుకునేది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో! ఇప్పటికే ‘ఏమిటో ఈ మాయ’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి ప్రేమకథాచిత్రాల్లో జంటగా నటించిన నిత్యా, శర్వానంద్ మరోసారి కలిసి హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బెంగుళూర్ డేస్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! తొలుత ఇందులో హీరోహీరోయిన్లుగా సమంతా, సిద్ధార్థ ఇద్దరూ కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరూ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. అనంతరం ఎంతోమంది పేర్లు తెరమీదకి వచ్చాయి. అయితే.. చివరకు నిత్యా, శర్వా ఇద్దరూ కన్ఫర్మ్ అయ్యారు. ఈ సినిమాలో నిత్యాకు భర్తగా శర్వానంద్ కనిపిస్తాడని సమాచారం! మలయాళం మాతృకలో ఈ భార్యాభర్తల పాత్రలను నజ్రియా, ఫహాద్ ఫాజిల్ పోషించడం జరిగింది.

ఇక ఈ చిత్రాన్ని ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నెల మొదటి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitya Menon  Sharwanand  Bangalore Days Telugu Remake  Dilraju  

Other Articles