Rajendra prasad counter attack on Jayasudha | Maa Controversy elections

Rajendra prasad punch jayasudha comments

Rajendra Prasad news, Rajendra Prasad updates, Rajendra Prasad controversy, Rajendra Prasad gallery, Rajendra Prasad news, jayasudha controversy, jayasudha news, jayasudha updates, Rajendra Prasad jayasudha news, maa elections controversy, maa controversy

Rajendra Prasad Punch Jayasudha Comments : Natakireeti Rajendra Prasad given a power punch to jayasudha comments which she had done before on him.

‘అదిలేని బ్రతుకెందుకు?’.. జయకు రాజేంద్రుడి పంచ్!

Posted: 04/20/2015 02:53 PM IST
Rajendra prasad punch jayasudha comments

తెలుగు చిత్రపరిశ్రమలో మరెన్నడూ జరగని విధంగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల పోరులో చివరకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే! ఈయన గెలుపుపై ఎందరో హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఆవేదన చెందారు. అలాంటివారిలో జయసుధ కూడా వున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజేంద్రుడి గెలుపుపై మొదట ప్రశంసలు కురిపించిన ఆమె ఆ తర్వాత తనదైన రీతిలో ఆరోపణలు చేశారు కూడా! ఓ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఆమె.. ‘రాజేంద్రప్రసాద్ కామెడీ చేసి గౌరవం కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మొదట స్పందించని రాజేంద్రప్రసాద్.. ప్రమాణస్వీకార నేపథ్యంలో అందుకు గట్టి సమాధానమే ఇచ్చారు.

‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఆదివారం ప్రమాణస్వీకార నేపథ్యంలో జయసుధ కామెంట్లపై రాజేంద్రప్రసాద్ బాగానే పంచ్ ఇచ్చారు. ‘కొందరు నేను కామెడీ చేస్తున్నానని అంటున్నారు. కామెడీ లేని బ్రతుకెందుకు? కష్టాల్లో.. బాధల్లో కూడా 35 ఏళ్లుగా కామెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను' అని సమాధానం ఇచ్చారు. అనంతరం.. పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే తమను ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తామని, త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajendra Prasad  Jayasudha  Maa Controversy  

Other Articles