Singer Sunitha Turns Actress With Bramhotsavam Movie | Mahesh Babu Movie Updates

Singer sunitha upadrashta turns actress mahesh babu bramhotsavam movie

Singer Sunitha, Singer Sunitha news, Singer Sunitha updates, Singer Sunitha songs, Singer Sunitha controversy, Singer Sunitha mahesh babu, Singer Sunitha actress, sunitha turns actress, sunitha gossips, sunitha comments, sunitha news

Singer Sunitha Turns Actress With Bramhotsavam Movie : Telugu Famous Singer Sunitha Upadrashta May Play A Key Role In Mahesh Babu's Latest Flick Bramhotsavam Which Is To Be Directed By Srikanth Addala

‘బాబు’ కోసం నటిగా అవతారమెత్తిన సింగర్

Posted: 04/20/2015 01:05 PM IST
Singer sunitha upadrashta turns actress mahesh babu bramhotsavam movie

సునీత.. తన మధురస్వరంతో టాలీవుడ్ ని మైమరిచిన సింగర్. అంతేకాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు చిత్రపరిశ్రమలో తన వాయిస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మేటి గాయని! ఇప్పటివరకు ప్రేక్షకులను తన గానంతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నటిగా మారి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. నిజానికి ఈమెకు గతంలో నటిగా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ.. వాటిని తిరస్కరించింది. గాయనిగానే కొనసాగుతానంటూ అప్పట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కానీ.. ఇంతలోనే ఈమె తన డెసిషన్ ని ఛేంజ్ చేసుకుని సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట! అది కూడా ‘బాబు’ కోసం ఈమె నటిగా మారనుందని సమాచారం! ఇంతకీ ఆ బాబు ఎవరని అనుకుంటున్నారా? మరెవరో కాదు.. ప్రిన్స్ మహేష్ బాబు!

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలోనే సునీత ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పాత్రకోసం మొదట్లో ఇతర నాయికలను దర్శకనిర్మాతలు సంప్రదించారు కానీ.. సింగర్ సునీత అయితే బాగా సూట్ అవుతందనే ఉద్దేశంతో ఆమెని సంప్రదించారట! ఈమె నటించబోయే పాత్ర గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరించగా.. అందులో నటించేందుకు సునీత ఒప్పుకుందని సినీవర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గానూ, చాలా ట్విస్ట్ గానూ సాగుతుందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే.. సునీత్ నటించడమే తరువాయి సినీవర్గాల్లో టాక్! అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక వివరాలు వెలువడాల్సి వుంది. ఈ వార్తపై సునీత ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. 1995 వ సంవత్సరంలో ‘గులాబీ’ చిత్రం ద్వారా గాయనిగా తెలుగు తెరకు పరిచయమైన సునీత.. ఆపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు 750 పైగా చిత్రాలకు తన సుమధుర గొంతుతో డబ్బింగ్ పాత్రలో కూడా మెరిసింది. ఇలా ఇంతవరకు తెరవెనుక వుంటూ తన గొంతుతో మాయ చేసిన ఈ అమ్మడు.. మరి నటిగా మారి తన అభినయంతో ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Singer Sunitha  Mahesh Babu  Bramhotsavam News  

Other Articles