Raai Laxmi feeling exciting for getting bollywood offer | Akeera Movie updates

Raai laxmi bollywood akeera movie offer director murugadoss sonakshi sinha

Raai Laxmi news, Raai Laxmi hot pics, Raai Laxmi hot photo shoot, Raai Laxmi hot gallery, Raai Laxmi images, Raai Laxmi akeera movie, Raai Laxmi gossips, sonakshi sinha news, sonakshi sinha hot photos, ar murugadoss

Raai Laxmi bollywood akeera movie offer director murugadoss sonakshi sinha : South Indian sexy star Raai Laxmi feeling exciting for getting a huge offer in bollywood akeera movie. In this movie Sonakshi playing in lead role and directed by ar murugadoss

ఓలమ్మో.. దర్శకుడు ఇచ్చిన ఛాన్స్ కి మురిసిపోయింది!

Posted: 04/18/2015 01:18 PM IST
Raai laxmi bollywood akeera movie offer director murugadoss sonakshi sinha

ఇండస్ట్రీలో సెక్సీతారగా పేరొందిన రాయ్ లక్ష్మీ.. గతకొన్నాళ్ల అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడపుతోంది. ఏదైనా ఓ భారీ సినిమాలో నటించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది కానీ.. ఎవరూ ఆమెకి ఆఫర్లు ఇవ్వడం లేదు. గతంలోలాగా ఈమెకి సక్సెస్ లు లేని నేపథ్యంలో దర్శకనిర్మాతలు ఆమెపై దృష్టి సారించడం లేదు. దీంతో గాడిలో పడిన తన కెరీర్ ని లిఫ్ట్ చేసేందుకు సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ తమిళ దర్శకుడు ఈమెని పిలిచిమరీ ఓ భారీ ఆఫర్ ఇచ్చాడు. అంతే! అప్పటినుంచీ ఈమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ ప్రస్తుతం బాలీవుడ్ లో సోనాక్షీ సిన్హాతో కలిసి ‘అకీరా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీలోనే రాయ్ లక్ష్మీకి ఈ దర్శకుడు ఓ కీలకపాత్రలో నటించే ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ అమ్మడు ఈ సినిమా కోసం ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా.. మురగదాస్ పిలిచి మరీ ఓ మంచి ఆఫర్ ఇచ్చారు. ఇందులో నా పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఈ ఆఫర్ ఇచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’ అని అంటూ మురిసిపోతోంది. మరి.. ఈ మూవీ తర్వాత అక్కడ ఆమెకు ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే!

ఇదిలావుండగా.. రాయ్ లక్ష్మీ తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందనున్న మరో మూవీలో నటించనుంది. ఇదివరకు ఈ మూవీ ముహూర్త కార్యక్రమాలు ముగిశాయి కూడా! ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Laxmi  sonakshi sinha  akeera movie  ar murugadoss  

Other Articles