raviteja not satisfied some scenes in kick 2 movie | tollywood news

Raviteja kick 2 movie reshooting surendar reddy kalyan ram rakul preet singh

raviteja news, raviteja updates, kick 2 movie news, kick 2 movie updates, kick 2 movie reshoot, kick 2 movie gossips, rakul preet singh, surendar reddy, kalyan ram

raviteja kick 2 movie reshooting surendar reddy kalyan ram rakul preet singh : Some portions in Kick 2 are not liked by Ravi because he felt he is looking quite lean. For that reason, he asked Suri to shoot them again.

‘కిక్’ ఎక్కడం లేదంటున్న మాస్ మహారాజా?

Posted: 04/18/2015 04:04 PM IST
Raviteja kick 2 movie reshooting surendar reddy kalyan ram rakul preet singh

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘కిక్-2’ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు. నటుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రవికి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంతవరకు జరిగిన షూటింగ్ లో భాగంగా రవి తనవంతు పూర్తి న్యాయం చేశాడని, ప్రేక్షకులను అలరించేవిధంగా షూటింగ్ సమయంలో నటన కనబరిచాడని చిత్రం యూనిట్ అంటోంది. అయితే.. రవికి మాత్రం మునుపటిలా తనకు ‘కిక్’ ఎక్కడం లేదని చెబుతున్నట్లు సమాచారం!

ఈ మూవీ యూనిట్ సంబంధించిన ఒక మెంబర్ మాట్లాడుతూ.. ‘కిక్-2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు రవితేజకు నచ్చలేదట! ఎందుకంటే ఆయా సన్నివేశాల్లో తాను చాలా సన్నగా కనబడుతున్నాడని, అలాగే కాస్త డీలా పడిపోయినట్లుగా అనిపించిందని అతడు డైరెక్టర్ సురేందర్ తో వెల్లడించాడు. అందుకే.. ఆ సీన్లను మరోసారి రీషూట్ చేద్దామని దర్శకుడిని కోరాడు’ అని వెల్లడించాడు. దీంతో రవితేజ చెప్పినట్లుగా సురేందర్ కొన్ని సన్నివేశాలను మరోసారి రీషూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే.. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కంటే మరీ ఎక్కువ కానుందన్నమాట! ఈ దెబ్బతో ‘కిక్-2’ మే 7వ తేదీన రిలీజ్ కాకపోవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుండగా.. ఇంతవరకు రవితేజ నటించిన సినిమాలన్నింటిలోనూ ఒక్కసారి కూడా రీ-షూట్ చేయలేదు. మొదటి షూట్ కే తన బెస్ట్ పెర్ఫార్మెన్ తో మెప్పించే ఈ నటుడు.. ఈసారి ‘కిక్-2’ కోసం రీ-షూట్ చేయడం ఆశ్చర్యంగా వుందని అంటున్నారు. మరోవైపు.. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని కొన్ని లొకేషన్లలో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో మార్కెట్ దగ్గర యాక్షన్ సీన్లు ఎంతో అద్భుతంగా వచ్చాయని యూనిట్ మెంబర్లు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  kick 2 movie  rakul preet singh  kalyam ram  

Other Articles