Mahesh Babu | Angana Roy | Srimanthudu

Angana roy romance with mahesh babu

Mahesh Babu Romance with Angana Roy, Angana Roy, Mahesh Babu Srimanthudu Teaser Release Date, Mahesh Babu Srimanthudu movie news, koratala shiva Srimanthudu Movie news, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie shooting, Srimanthudu Movie details, Srimanthudu Movie heroine, Srimanthudu Movie stills, Mahesh Srimanthudu

Angana Roy Romance with Mahesh Babu: Mahesh Babu latest movie working title Srimanthudu. Bengal Actress Angana Roy act special role in mahesh movie. Directior koratala shiva. shruti hassan heroine.

బెంగాలీ హాటు భామతో ప్రిన్స్ రొమాన్స్

Posted: 04/13/2015 03:39 PM IST
Angana roy romance with mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవడంతో... ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో వున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ హీరోగా ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మైత్రి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మరో హాట్ భామ కూడా చేరిపోయింది. బెంగాలీ భామ అంగనా రాయ్... ఇందులో ఓ హాట్ గ్లామరస్ పాత్రలో నటిస్తుంది.

ఈ విషయాన్ని ఇటీవలే అంగనా రాయ్ చెప్పుకొచ్చింది. మహేష్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా వుందని, ఈ సినిమాలో తనది గ్లామరస్ పాత్ర అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తెలుగులో తనకు మహేష్, పవన్ కళ్యాణ్, రవితేజలకు పెద్ద అభిమానిని అంటూ తెలియజేసింది.

ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మే 31న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలు మరియు టీజర్ విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. ఇందులో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్ ఆలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Angana Roy  Srimanthudu  

Other Articles