Pawan Kalyan | Gabbar singh2 | Movie

Gabbar singh2 movie latest updates

Gabbar singh2 movie latest news, Gabbar singh2 movie updates, Gabbar singh2 movie details, Gabbar singh2 movie news, Gabbar singh2 movie stills, Pawan Kalyan latest news, Pawan Kalyan latest stills, Pawan Kalyan news, Pawan Kalyan movies, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Gabbar singh2 movie latest Updates: Powerstar pawan kalyan upcoming Gabbar singh2. Producer sharat marar, director Bobby. Music Devisriprasad.

గబ్బర్ సింగ్2 ఎంట్రీకి సర్వం సిద్ధం... వచ్చేస్తున్నాడు!

Posted: 04/03/2015 12:00 PM IST
Gabbar singh2 movie latest updates

హిందీలో వచ్చిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టామినా, క్రేజ్ లను భారీగా పెంచేసింది. అయితే ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించాక.. సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్2’ను కూడా రానుందని అప్పట్లో వార్తలొచ్చాయి.

‘గబ్బర్ సింగ్2’ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని, పైగా ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు అన్ని జరిగిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలాగే ఈ ప్రాజెక్టు నుంచి సంపత్ నంది తప్పుకోవడంతో.. ఇక ‘గబ్బర్ సింగ్2’ వుంటుందో లేదో అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టును ‘పవర్’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరును తెచ్చుకున్న దర్శకుడు బాబీ చేపట్టాడు. ఈ ప్రాజెక్టు బాబీ చేతిలో పడిన కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో... ‘గబ్బర్ సింగ్2’ ఇక పూర్తిగా ఆగిపోయిందేమోనని టాలీవుడ్ లో రకరకాల వార్తలొస్తున్నాయి

కానీ ఈ వార్తలపై తాజాగా ‘గబ్బర్ సింగ్2’ నిర్మాత శరత్ మరార్ స్పందించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... భారీ బడ్జెట్ చిత్రం మరియు భారీ అంచనాలతో రూపొందనున్న చిత్రం కాబట్టి.. పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాం. స్ర్కిప్టు పని జరుగుతోంది. దర్శకుడు బాబీ స్ర్కిప్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అన్ని సిద్ధం అయ్యాకే షూటింగ్ ప్రారంభం తేదిని అధికారికంగా ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే దర్శకుడు బాబీ మాట్లాడుతూ... ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఏ రేంజులో ఆశిస్తారో తెలిసిందే. అభిమానుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అన్ని అంశాలతో ఈ కథను తయారు చేశాం. స్ర్కిప్టు వర్క్ పక్కాగా పూర్తయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్టును చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్ర్కిప్టు వర్క్, లొకేషన్స్, నటీనటుల డేట్స్ అన్ని పక్కాగా కుదిరిన తర్వాతే ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని, త్వరగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలకు తెలియజేసాడట. దీంతో దర్శకనిర్మాతలు కూడా పవన్ చెప్పినట్లుగానే పక్కాగా ‘గబ్బర్ సింగ్2’ ను ప్లాన్ చేస్తున్నారు.

‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ‘కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ... రావడం మాత్రం పక్కా!’ అన్నట్లుగా ‘గబ్బర్ సింగ్2’ కూడా ఎంట్రీ ఇవ్వడానికి కాస్త ఆలస్యం అవుతున్నా కూడా... పవర్ స్టార్ మాత్రం ‘గబ్బర్ సింగ్2’ గా త్వరలోనే ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అర్థమవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఏమో చూడాలి.

video courtesy: MAA TV

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar singh2  Movie Updates  

Other Articles