OK Bangaram | Aye Amaayika | song

Ok bangaram aye amaayika song

OK Bangaram Aye Amaayika song released, OK Bangaram audio release date, Nithya Menon movie title OK Bangaram, Mani Ratnam OK Bangaram, Mani Ratnam OK Bangaram shooting, Mani Ratnam OK Bangaram shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam OK Bangaram movie, Mani Ratnam OK Bangaram stills, Mani Ratnam OK Bangaram news, Mani Ratnam OK Bangaram details, Mani Ratnam OK Bangaram movie updates, Mani Ratnam, OK Bangaram

OK Bangaram Aye Amaayika song: Mani Ratnam upcoming movie Ok Bangaram Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Bangaram is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam.

అబ్బా... ఈ బంగారం సూపర్ గా వుంది!

Posted: 04/03/2015 10:30 AM IST
Ok bangaram aye amaayika song

మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓకే బంగారం’. తమిళంలో ‘ఓకే కణ్మని’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 4న ఘనంగా విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

‘ఓకే బంగారం’ చిత్రానికి తెలుగులో రోజురోజుకీ భారీగా క్రేజ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మాధవన్, షాలిని హీరోహీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంగా రూపొందిన ‘సఖి’... ఇప్పటికీ కూడా యువతను ఆకట్టుకుంటూనే వుంది. అయితే అలాంటి తరహాలోనే మణిరత్నం మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో మనముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రంలోని ‘మెంటల్ మదిలో’ అనే పాటను ఇటీవలే విడుదల చేసారు. అయితే తాజాగా ‘ఏయ్ అమాయికా...’ అనే పాటను టీజర్ ను విడుదల చేసారు. ఈ పాట చూస్తుంటే నిత్యా, సల్మాన్ ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా వుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నీవేశాలు చాలానే వున్నట్లుగా కనిపిస్తున్నాయి.

తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయ్యడానికి ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ok Bangaram  Aye Amaayika song  Mani Ratnam  

Other Articles