Radhika Apte | Sex | Movies

Actress radhika apte sensational comments on sex

Radhika Apte comments on Sex, Radhika Apte talks about Sex, Radhika Apte sex comments, Radhika Apte latest news, Radhika Apte news, Radhika Apte movie news, Radhika Apte movie updates, Radhika Apte

Actress Radhika Apte sensational comments on Sex: Radhika Aptes sensational comments on Tollywood ... I don't know any friend of mine who hasn't had sex before marriage.

ఆకలేస్తే అన్నం... కోరికలుంటే సెక్స్ అంతేనట

Posted: 03/31/2015 12:35 PM IST
Actress radhika apte sensational comments on sex

బాలయ్య సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించిన రాధిక ఆప్టే సెక్స్ గురించి బహిరంగంగానే కామెంట్లు చేస్తోంది. సెక్స్ చేయడంలో తప్పేంలేదని.. పైగా సెక్స్ చేయకపోతేనే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వస్తుందనే వుద్దేశ్యంతో రాధిక కామెంట్లు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఈ సెక్సీ కామెంట్లు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఈ అమ్మడు హిందీలో ‘హంటర్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే భారీ ఆడల్ట్ సినిమా వలే అనిపించింది. సినిమా విడుదలయ్యాక అదే టాక్ తో మంచి విజయం సాధిస్తోంది. అయితే ఈ సినిమా గురించి రాధిక మాట్లాడుతూ కొన్ని హాట్ హాట్ విషయాలను చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ... పెళ్లికి ముందే గర్భవతి అయ్యి, అబార్షన్ చేయించుకున్న పాత్రలో నటించానని... ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే క్యారెక్టర్ లో నటించానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా... ప్రస్తుతం వున్న అమ్మాయిలెవరూ కూడా సతిసావిత్రి మాదిరిగా పద్ధతిగా వుండటం లేదని సంచలన కామెంట్లు చేసింది.

సెక్స్ కోసం పరితపించి పోతున్న ఆడవాళ్లెవ్వరూ కూడా పెళ్లి వరకూ ఆగడం లేదని... పెళ్లికి ముందే వారి సెక్స్ కోరికలు తీర్చేసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా.. తన ఫ్రెండ్ ఒకరు పెళ్లికి ముందే ఇలా సెక్స్ ఎంజాయ్ చేసిందని... అయినా ఆకలేస్తే అన్నం ఎలా తింటామో.. శరీరానికి సెక్స్ కోరికలు కూడా తీర్చుకోవడం కూడా అంతే అవసరమని.. పైగా సెక్స్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చింది.

ఈ అమ్మడి మాటలు ప్రస్తుతం అంతటా హాట్ టాపిక్ గా మారాయి. రాధిక కామెంట్లు విన్నవాళ్లంతా కూడా ‘మరి ఈ భామ ఎన్నిసార్లు సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసిందో... ’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నా కూడా.. ఈ అమ్మడు ఇలా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. రాధికకు కూడా ఈమధ్య ఇలాంటి హాట్ హాట్ ఆఫర్లే వస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Comments  Sex  

Other Articles