Sumalatha | love story | Ambareesh

Actress sumalatha reveals her love story

Sumalatha reveals her love story, Sumalatha love story, Actress Sumalatha Ambareesh, Sumalatha Ambareesh news, Sumalatha Ambareesh latest news

Actress Sumalatha reveals her love story: Actress Sumalatha reveals her love story with Kannada actor Ambareesh.

సుమలత ప్రేమకు సుహాసిని అడ్డంకులు

Posted: 03/30/2015 12:57 PM IST
Actress sumalatha reveals her love story

నటి సుమలత, కన్నడ నటుడు అంబరీష్ జంట తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీమంజునాథ’ చిత్రంలో ఓ కీలక పాత్రలలో నటించారు. అంబరీష్, సుమలతలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వీరి ప్రేమను చాలా మంది అడ్డుకోవాలని ప్రయత్నించారట. అందులో నటి సుహాసిని కూడా ఒకరట. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవలే సుమలత చెప్పుకొచ్చింది.

నటీనటులుగా బిజీగా వున్న సుమలత, అంబరీష్ లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ సమయంలో అంబరీష్ తో జాగ్రత్తగా వుండమని సుమలతకు సుహాసిని సలహా ఇచ్చిందట. అలాగే సుమలత మేకప్ మెన్ కూడా అంబరీష్ తో దూరంగా వుండాలని సుమలతకు సలహా ఇచ్చారట. కానీ సుమలత మాత్రం ఈ విషయాలేమి పట్టించుకోకుండా తన మనసుకు నచ్చిన పని చేసారు. ఈ విషయాన్ని స్వయంగా సుమలత ఇటీవలే చెప్పుకొచ్చింది.
సుమలత, అంబరీష్ లు కన్నడ, తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా చాలా చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కూడా రజనీకాంత్, చిరంజీవిలకు మంచి మిత్రులు కూడా. అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం హాయిగా సాగుతోందని చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumalatha  love story  Ambareesh  

Other Articles