Shruti Hassan | Tamanna | Nagarjuna

Shruti hassan replaced by tamanna

Shruthi Haasan replaces Tamanna, Tamanna in pvp banner, Tamanna romance with karthi, Tamanna latest news, Tamanna movie news, Tamanna movie updates, Tamanna news, Tamanna latest stills, Tamanna hot stills, Tamanna

Shruti Hassan replaced by Tamanna: Shruti Hassan replaced by Tamanna in PVP banner latest movie.Nagarjuna and Karthi Movie, PVP Producer, Vamshi paidipalli direction.

శృతితో కాకుండా తమన్నాతో రొమాన్స్

Posted: 03/30/2015 11:52 AM IST
Shruti hassan replaced by tamanna

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ముందుగా శృతిహాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

మరికొద్ది రోజుల్లో షూటింగ్ లో పాల్గొనాల్సిన సమయంలో... ఈ ప్రాజెక్టు నుంచి శృతి తప్పుకోవడంతో ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంపై లీగల్ గా చర్యలు తీసుకోవడానికి ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసారు.

ఏప్రిల్ 7నుంచి తమన్నా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. కార్తీ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. గతంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. మొదటి షెడ్యూల్ దాదాపు చివరి దశకు చేరుకుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Replace  Shruti Hassan  PVP  

Other Articles