tamannaah to replace shruti haasan in pvps bilingual movie

Tamannaah may replace in pvps bilingual movie

tamannaah, actress tamannaah, tamannaah jackpot, tamannaah stills, tamannaah new gallarey, tamannaah news, tamannaah updates, tamannaah phots, shruti haasan stills, shruti haasan gallery, shruti haasan new phots, shruti haasan new stills, shruti haasan updates, shruti haasan news,

actress tamannaah may replace shruti haasan in pvps bilingual movie directed by vamsi paidipally

ఆమె పోయి తమన్నా వచ్చే డాం..డాం..ఢాం..!

Posted: 03/29/2015 04:52 PM IST
Tamannaah may replace in pvps bilingual movie

కత్తిపోయి డాలు వచ్చే డాం డాం ఢాం.. అన్న సరదా సరదా నానుడి.. ఇప్పుడు నిజంగానే శృతి హాసన్ నటనా జీవితంలో చిన్న షాక్ తెచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..? శ్రుతి హసన్ పోయి.. తమన్నా వచ్చింది.. ఇది టాలీవుడ్, కోలీవుడ్ లలో తాజా వార్తగా నిలుస్తుంది. ఎట్టెట్టా..? అంటూ ఆరాలు తీసి అలసిపోకండి.. అక్కడికే వస్తున్నాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో పీవీపీ సినిమా రూపోందిస్తున్న ద్విభాషా చిత్రంలో తమన్నాను హీరోహిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ముందుగా శ్రుతి హసన్ ను అనుకున్నారు. అందుకు అమె కూడా అంగీకరించింది. కానీ తీరా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత డేట్లు ఖాళీలేవంటూ నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చిందింది. అందుకు కోర్టు చేత చివాట్లు కూడా తిన్నింది. అయితే  ఇప్పుడు అదే సినిమాలో శృతి స్థానంలో తమన్నాను ఎంపిక చేసినట్లు లిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఫ్రెంచ్ చిత్రం 'ది ఇన్టచబుల్' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ ఓ వ్యాధిగ్రస్తుడిగా, అతని సహాయకుడి పాత్రలో కార్తీ నటిస్తున్నారు.  కార్తీకి జోడిగా తమన్నా ఎంపిక ఖరారవ్వడంతో గతంలో శ్రుతితో చేసిన సీన్లన్నీ రీషూట్ చేయాలని దర్శకుడు వంశీ అనుకుంటున్నాడట. శ్రుతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్ను ఆదేశించింది. తమన్నా ప్రస్తుతం రవితేజ సరసన 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood news  kollywood news  shruti haasan  tamannaah  

Other Articles