kona venkat | Thieves | Danayya

Thieves attack on kona venkat

thieves attack on kona venkat and Danayya, thieves attack on kona venkat, kona venkat latest news, kona venkat news, kona venkat stills, kona venkat, Danayya news

Thieves attack on kona venkat: Writter kona venkat and Producer Danayya attacked by Unknown street thieves.

కోన వెంకట్, దానయ్యలపై దోపిడి దొంగల దాడి

Posted: 03/28/2015 12:16 PM IST
Thieves attack on kona venkat

నగరంలో దొంగతనాలు బాగా ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఈ మధ్య రోడ్డుపై వెళ్లే వాహనాలను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా కొంతమంది సినీనటుల కార్లను దొంగలు అడ్డుకొని, వారి దగ్గరున్న విలువైన వస్తువులను, డబ్బులను దోచుకుని పారిపోయారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జన్మదినం సంధర్భంగా ప్రకాష్ రాజ్ ఫాంహౌస్ లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి కోన వెంకట్, దానయ్య, శ్రీనువైట్ల, థమన్ లు పాల్గొన్నారు.

పార్టీ అనంతరం తిరిగి బయల్దేరారు. షాద్ నగర్ లోని నూర్ కాలేజ్ సమీపంలోకి రాగానే కొంతమంది దొంగలు కోన వెంకట్, దానయ్యలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, కారు అద్దాలను పగలగొట్టారు. అనంతరం వారి దగ్గరున్న బంగారు చైన్ లను, అలాగే ఆ కార్ డ్రైవర్ దగ్గరున్న 1500 రూపాయలను దోచుకొని పారిపోయారు.

అయితే వెనక కారులో వస్తున్న శ్రీనువైట్ల, థమన్ లు ఈ సంఘటన గమనించి అటునుంచి వెనక్కివెళ్లిపోయారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల్లో దొంగతనాలను అరికట్టేందుకు, అలాగే దొంగలను పట్టుకోవడానికి కొత్త కొత్త టెక్నిక్ లను తీసే సినిమావాళ్లకే ఆ దొంగలు ఇలా ఓ షాకిచ్చేసి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thieves attack  kona venkat  Danayya  

Other Articles