Shahid kapoor to marry delhi girl meera rajput

shahid kapoor news, shahid kapoor marriage, shahid kapoor wedding bells, shahid kapoor meera rajput, meera rajput wedding bells, shahid kapoor marriage updates, shahid kapoor family members, shahid kapoor secret love affair

shahid kapoor to marry delhi girl meera rajput : Bollywood handsome hero to tie knot with delhi girl meera rajput. Engagement has already done in january month.

ఢిల్లీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న షాహిద్

Posted: 03/23/2015 04:09 PM IST
Shahid kapoor to marry delhi girl meera rajput

బాలీవుడ్ లో ఇన్నాళ్లూ బ్యాచిలర్ హీరోగా కొనసాగిన నటుడు షాహిద్ కపూర్.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం! గతకొన్నాళ్ల నుంచి సీక్రెట్ గా వున్న ఈ వ్యవహారం... చివరికీ ఇప్పుడు బట్టబయలైంది. ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌‌పుత్ అనే అమ్మాయితో ఇతగాడు డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ఈ ఏడాది జనవరి 14న రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిందట!

ఇక షాహిద్ చేసుకోబోయే అమ్మాయి మీరా వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఇంగ్లీష్ (ఆనర్స్) థర్డ్ ఇయర్ చదువుతున్న మీరా రాజ్‌పుత్.. వసంత వ్యాలీ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ‘రాధాస్వామి సత్సంగ్ బియాస్’ అనే మతపరమైన సంస్థ ద్వారా వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఈ గ్రూప్ ను షాహిద్, అతని తండ్రి నిత్యం ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి కూడా అక్కడికి రావడంతో ఆమెకి, షాహిద్ కి మధ్య స్నేహం ఏర్పడింది. కాలక్రమంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు ఆ విషయం పెళ్లిదాకా వెళ్లింది.

ఇప్పటికే షాహిద్ తండ్రి, నటుడు కూడా అయిన పంకజ్ కపూర్.. మీరా ఇంటికి వెళ్లి ఈ పెళ్లి విషయమై ఆమె తలిదండ్రులతో మాట్లాడి వచ్చినట్టు సమాచారం! ఇప్పటివరకు తన పెళ్లి గురించి పెదవి విప్పని షాహిద్.. ఏకంగా ఈ విధంగా షాకిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇదిలావుండగా.. గతంలో షాహిద్ తాను ఇండస్ట్రీకి చెందని అమ్మాయితో వివాహం చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే! ఇప్పుడు దాన్నే ఆచరణలో పెడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahid kapoor  pankaj kapoor  meera rajput  shahid wedding bells  

Other Articles