Prabhas and rajamouli in soundaryalahari

Prabhas in soundaryalahari, Rajamouli in Soundaryalahari, Prabhas in soundaryalahari program, Prabhas and Rajamouli in soundaryalahari, Prabhas latest news, Prabhas movie updates, Prabhas movie stills, Prabhas latest updates, Prabhas news, Prabhas stills, Prabhas

Prabhas and Rajamouli in soundaryalahari: Young rebel star prabhas upcoming movie bahubali. director ss rajamouli. rajamouli and prabhas in soundaryalahari.

సౌందర్యలహరితో జక్కన్న బాహుబలి

Posted: 03/19/2015 12:34 PM IST
Prabhas and rajamouli in soundaryalahari

ప్రముఖ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇటీవలే ‘మౌనముని’ ముద్రను చెరిపేసే విధంగా ‘సౌందర్యలహరి’ కార్యక్రమం ద్వారా మాట్లాడటం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు తన సన్నిహిత వ్యక్తులతో రాఘవేంద్ర రావు ముచ్చటిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు విచ్చేసారు. అయితే త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ను ఈనెల 17న చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

రాజమౌళి దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన చిత్రం ‘స్టూడెంట్ నెం.1’. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు పర్యవేక్షకుడిగా బాధ్యత వహించారు. రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా రాజమౌళి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి... ఆ తర్వాత తనదైన శైలిలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో... ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తన ఖాతాలో లేకుండా హిట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం ‘బాహుబలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ప్రభాస్, రాఘవేంద్రరావులకు మంచి అనుబంధం వుంది. దీంతో ప్రభాస్, రాజమౌళిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ ‘బాహుబలి’ మొదటి భాగం మే 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Rajamouli  Soundaryalahari  Bahubali  

Other Articles