నిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకం పై డి. వెంకటేష్ ఈ సంవత్సరం లో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు. దీనిలో భాగంగా ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మ తో మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు...ఈ రెండు కాకుండా మరో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ స్క్రిప్ట్ పై కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి .
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్ సినిమాలు,హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు తీశారు . అడపాదడపా రంగిలా , మస్త్, ప్రేమకథ లాంటి.... లవ్ స్టోరీలు తీసినా వాటిల్లో ఒక వయలెంట్ బ్యాగ్రౌండో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఫాంటసీ బ్యాగ్రౌండో వుండేది , కానీ 365 days లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే” వర్మ గారు తన 25 ఏళ్ల కెరియర్ లో 100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటి సారి తీయటం "
వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్ లవ్ & మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.... చిత్రం చూసినవాళ్లు “365 days” చిత్రకథ ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days” ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే కాదు .....ప్రతి ఒక్కరి ప్రేమ కథ. & ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపు నివ్వబోతున్నారు. ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..' అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more